ఖానాపూర్‌లో వ్యక్తి దారుణ హత్య 

ప్రేమ వ్యవహారమే కారణమా..?

ఖానాపూర్‌, న్యూస్‌టుడే: ఖానాపూర్‌ పట్టణంలోని పద్మావతి నగర్‌ కాలనీలో జరిగిన ఓ యువకుడి హత్య సంచలనంగా మారింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. కొన్నేళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ హట్వాల్‌ శకుంతల, లక్ష్మణ్‌ల కుమారుడు సందీప్‌ (32) మూడేళ్ల క్రితం మరో సామాజిక వర్గానికి చెందిన యువతితో జరిపిన ప్రేమ వ్యవహరం పలు వివాదాలకు దారితీసింది. అయితే గురువారం ఉదయం మేల్కొనేసరికి సందీప్‌ రక్తపు మడుగులో పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అప్పట్లో ఆ యువతి కుటుంబసభ్యులతో సందీప్‌ కుటుంబ సభ్యులకు గొడవలు జరగడంతో సందీప్‌ ఆమెను పెళ్లి చేసుకొని కొద్ది రోజులు హైదరాబాద్‌లో కాపురం పెట్టాడు. అప్పట్లో మృతుడి కుటుంబ సభ్యులపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. తర్వాత అంతా సద్దుమణిగింది అనుకొన్న తరుణంలో సందీప్‌కు, అతని భార్యకు మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె మూడు నెలల నుంచి పుట్టింట్లోనే ఉంటోందని తెలిపారు. నెల రోజుల క్రితం కూడా ఇదే విషయమై ఇరు కుటుంబాల మధ్య వివాదం చోటు చేసుకొంది. దాంతో ఇరు కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరు కుటుంబాలకు చెందిన వారిని బైండోవర్‌ చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ యువతి కుటుంబ సభ్యుల నుంచి తన కుమారుడికి ప్రాణహాని ఉందని పలుమార్లు పోలీసులకు మొరపెట్టుకొన్నా అసలు తమను పట్టించుకోలేదని సందీప్‌ తల్లి శకుంతల ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు సకాలంలో స్పందించి చర్య తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేది కాదని శకుంతల  వాపోయారు. బహిరంగంగానే పోలీస్‌ ఠాణాలో ఆ యువతి కుటుంబ సభ్యులు తన కుమారుడిని చంపేస్తామని బెదిరించినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటాక ఇంటి ఆవరణలో ఆరుబయట సోఫాలో నిద్రిస్తున్న సందీప్‌ను పదునైన ఆయుధంతో గాయపర్చారని మృతుడి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు యువతి కుటుంబ సభ్యులు మజీద్‌, సజ్జద్‌, షబ్బీర్‌, ముజాహిద్‌ అలియాస్‌ ముజ్జు, సాదిక్‌, మున్ని, అఫ్రోజ్‌, ఇమ్రాన్‌, హఫీజ్‌, నజీర్‌, మొయినొద్దీన్‌ ఇర్ఫాన్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్‌ పేర్కొన్నారు. 
హత్యా.. ఆత్మహత్యా..? 
సంఘటన స్థలంలో చోటు చేసుకొన్న పరిస్థితులను బట్టి ఇది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. హత్య జరిగిన స్థలంలో ఇటుక పెళ్లలు పగిలి ఉండడం, మద్యం సీసా, సిగరెట్‌ పెట్టె, అగ్గిపెట్టెతో పాటు ఓ బ్లేడు కూడా ఉండడంతో అసలు సంఘటన ఎలా జరిగిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి చేతులకు పదునైన ఆయుధంతో గాయం చేసినట్లు చేతులకు, పొట్ట భాగంలో పూర్తిగా రక్తం పేరుకుపోయి ఉండడంతో అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు ఘటన స్థలంలో సాక్ష్యాలను సేకరించేందుకు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ బృందాలను రప్పించి దర్యాప్తు చేపట్టారు. అయితే సంఘటన స్థలాన్ని సందర్శించిన నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గతంలో సందీప్‌ ప్రేమ వ్యవహారం కారణంగా ఇరు కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నాయని, పాత కక్షలతోనే హత్యకు పాల్పడి ఉంటారని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల నుంచి దర్యాప్తు ముమ్మరం చేశామని పేర్కొన్నారు.

మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....