తెదేపా రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్‌ జయంతి

గుంటూరు: తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు దంపతులతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, గల్లా జయదేవ్‌, కోడెల శివప్రసాదరావు, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. పార్టీ కార్యాలంలో తెదేపా జెండా ఎగురవేసిన చంద్రబాబు నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇకపై ప్రతిరోజు గుంటూరు కార్యాలయానికి వస్తానని చెప్పారు. రోజూ 3గంటల పాటు నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు.

‘‘ తెదేపా కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు. ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రాభివృద్ధి కోసం మనవంతు ప్రయత్నించాం. ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి కాదు..ఒక శక్తి, వ్యవస్థ. సమాజానికి సేవ చేయాలి, మార్పు తేవాలనే ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారు. ఎదురుదెబ్బలు తిన్నా ఎన్టీఆర్‌ మనోధైర్యం కోల్పోలేదు. అదే స్ఫూర్తితో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం’’ అని కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


మరిన్ని

సైబర్‌ కామాంధుడు [08:05]

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారి తప్పాడు.. ఉద్యోగాలిప్పిస్తానంటూ మభ్యపెట్టి వాట్సాప్‌ ద్వారా మహిళల నగ్నచిత్రాలను సేకరించాడు. 16 రాష్ట్రాల్లోని సుమారు 2 వేల మందితో చెలగాటమాడాడు....

20 ఏళ్లకు వెలుగులోకి బాలుడి అపహరణ [07:58]

ఓ చోరీ కేసులో నిందితురాలిని విచారిస్తే రెండు దశాబ్దాల కిందట ఓ బాలుడిని అపహరించిన ఉదంతం బయటపడిన సంఘటన ఇది...

ఒకే కుటుంబంలో ముగ్గురిని కాటేసిన పాము [10:15]

నిద్రిస్తున్న సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని పాము కాటేసింది. వీరిలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ...

అచ్చే దిన్‌ వచ్చాక పెళ్లి చేసుకుందాం [16:17]

ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రజాప్రతినిధి రాఘవ్‌ చద్దాకు ఓ యువతి నుంచి ప్రపోజల్‌ వచ్చింది. చార్టెడ్‌ అకౌంటెంట్‌ నుంచి రాజకీయనేతగా మారిన రాఘవ్‌కు ఫీమేల్‌ ఫ్యా్‌న్‌ ఫాలోయింగ్‌ ఓ రేంజ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో

‘అలా చేయమని మోదీకి భాజపా నేతలు సూచించారా?’ [16:06]

ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు తగవని, విధానాలపై మాత్రమే వ్యాఖ్యానించాలని కాంగ్రెస్‌ పార్టీలోని పలువురు నేతలు వ్యాఖ్యానించడాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ సమర్థించారు. భాజపా నేతలు అలా చేయగలరా అని ప్రశ్నించారు..............

రాజధాని తరలించకూడదు: పవన్‌ [15:52]

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి తరలించకూడదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని మరింత మెరుగ్గా...

సర్‌.. చిరుకు ఎప్పుడైనా కథ చెప్పారా [15:44]

చాలా కాలం తర్వాత ‘వాల్మీకి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. వరుణ్‌ తేజ్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో హరీశ్‌...

ఫైనల్‌ చేరిన పీవీ సింధు [15:37]

భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ తార పూసర్ల వెంకట సింధు తనపై అంచనాలు నిలబెట్టుకుంది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ప్రత్యర్థి యూఫీచెన్‌ను...

రేపు జైట్లీ అంత్యక్రియలు [15:32]

అనారోగ్యంతో కన్నుమూసిన భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం జరగనున్నాయి. ఈ మేరకు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు

భారత్‌ నెమ్మదిస్తుంది.. కానీ..! [15:25]

ఆర్థిక మందగమనం నేపథ్యంలో భారత్‌ జీడీపీ 2019లో 6.2కు మాత్రమే పరిమితం అవుతుందని ప్రముఖ  రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ పేర్కొంది. గతంలో ప్రకటించిన...