ఇంటి నుంచే నేర్చుకో.. ఇన్ఫీ టీక్యూ 

నెక్స్‌ జనరేషన్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాం

టెక్నికల్‌.. కమ్యూనికేషన్‌.. రైటింగ్‌.. ఇలా అన్ని రకాల అప్‌డేటెడ్‌ నైపుణ్యాలను కలిగి ఉంటేనే ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధ్యం. అయితే ఆ ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నేర్చుకోవడం అందరికీ ఎలా కుదురుతుంది? ఇందుకు ‘ఇన్ఫీ టీక్యూ’ సరైన సాధనం. ఇన్ఫోసిస్‌ అందిస్తోన్న ఈ-లర్నింగ్‌ అప్లికేషన్‌ ఇది. మొబైల్‌, డెస్క్‌టాప్‌లకు అనుకూలమైన యాప్‌. పూర్తిగా ఉచితం. కాలేజీ చదువులు పూర్తయిన విద్యార్థులు ఎవరైనా... ఎక్కడి నుంచైనా ఈ నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. ఇన్ఫోసిస్‌తో పాటు అన్ని కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలను సంపాదించుకోవచ్చు.

ఇంజినీరింగ్‌, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు కూడా ఈ వేదిక ద్వారా తమ నైపుణ్యాలు పెంచుకోవచ్చు.

ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల నుంచి వచ్చే తాజా గ్రాడ్యుయేట్లను తీసుకుని, వారికి అత్యుత్తమ శిక్షణను అందించే సంస్థగా ఇన్ఫోసిస్‌కు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఆ శిక్షణను కళాశాలలో ఉండగానే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావటానికి ఇప్పుడు ఇన్ఫీ టీక్యూను అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఇన్ఫోసిస్‌ ప్రామాణిక కంటెంట్‌, ఐటీ, ప్రోగ్రామింగ్‌, డేటాబేస్‌ నైపుణ్యాలు, సాఫ్ట్‌స్కిల్స్‌ కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. క్యాంపస్‌ ద్వారా నియమించుకున్నవారికి ఇన్ఫోసిస్‌ ఇచ్చే ఇండక్షన్‌ శిక్షణతో ఇది సమానం. 
ప్రధానంగా ఇంజినీరింగ్‌, ఎంసీఏ, ఎంఎస్‌సీ -సీఎస్‌ విద్యార్థులకు ఉద్దేశించినప్పటికీ బీఎస్‌సీ లేదా ఏ ఉన్నతవిద్యాకోర్సు చేసేవారయినా ఇన్ఫీ టీక్యూకు సబ్‌స్క్రయిబ్‌ చేసుకోవచ్చు. అంతే కాదు; ఇంజినీరింగ్‌, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు కూడా ఈ వేదిక ద్వారా తమ నైపుణ్యాలు పెంచుకుని, ప్రయోజనం పొందవచ్చు. 
ఇన్ఫీ టీక్యూ మొబైల్‌ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లేదా వెబ్‌సైట్‌  https://infytq.infosys.com/ ద్వారా దీన్ని పొందవచ్చు.

ఇంజినీరింగ్‌, ఎంసీఏ, ఎంఎస్‌సీ -సీఎస్‌ విద్యార్థులకు ఉద్దేశించినప్పటికీ బీఎస్‌సీ లేదా ఏ ఉన్నతవిద్యాకోర్సు చేసేవారయినా ఇన్ఫీ టీక్యూకు సబ్‌స్క్రయిబ్‌ చేసుకోవచ్చు. 


ఏ కోర్సులు? 

ఇన్ఫీ టీక్యూలో నాలుగు ఫౌండేషన్‌ కోర్సులు, నాలుగు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కోర్సులు, కమ్యూనికేషన్‌ ఎటికెట్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ లాంటి ఫ్యూచర్‌/డిజిటల్‌ నైపుణ్యాలకు సంబంధించిన పరిచయ కోర్సులుంటాయి. 
ప్రస్తుతం అందిస్తున్న ఫౌండేషన్‌ స్కిల్స్‌: * ప్రోగ్రామింగ్‌ ఫండమెంటల్స్‌ యూజింగ్‌ పైథాన్‌: వ్యవధి 9 రోజులు *ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ యూజింగ్‌ పైథాన్‌: వ్యవధి 5 రోజులు బీ డేటా స్ట్రక్చర్స్‌ అండ్‌ అల్గారిదమ్స్‌ యూజింగ్‌ పైథాన్‌: వ్యవధి 7 రోజులు బీ లర్నింగ్‌

డీబీఎంఎస్‌ అండ్‌ ఎస్‌క్యూఎల్‌: వ్యవధి 10 రోజులు 
ఈ నాలుగు కోర్సులకూ నిర్దేశించిన వ్యవధి 31 రోజులైనప్పటికీ విద్యార్థి తన సామర్థ్యాన్ని బట్టి అంతకంటే ఎక్కువ వ్యవధిలోనూ పూర్తిచేసుకోవచ్చు. 
అందిస్తున్న సాఫ్ట్‌ స్కిల్స్‌:* బిజినెస్‌ ఇంగ్లిష్‌* బేసిక్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ కమ్యూనికేషన్‌ * స్పీక్‌ అప్‌* ఈ-మెయిల్‌ రైటింగ్‌ స్కిల్స్‌ 
డిజిటల్‌ బేసిక్స్‌ కోర్సులు: ‌* ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ 101 
* బ్లాక్‌చైన్‌ ఓవర్‌ వ్యూ * బిగ్‌ డేటా 101 * ఎన్‌ఓఎస్‌క్యూఎల్‌ డేటాబేసెస్‌ 101 
ఈ నైపుణ్యాలతో పాటు ఇన్ఫీ టీక్యూలో మరెన్నో కోర్సులను ప్రవేశపెట్టటం ఇన్ఫోసిస్‌ ప్రణాళికలో ఉంది.


ఇన్ఫోసిస్‌ సర్టిఫికేషన్‌ 

2020లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకునే ఇంజినీరింగ్‌, ఎం.ఇ., ఎంటెక్‌, ఎంఎస్‌సీ, ఎంసీఏ విద్యార్థుల్లో అర్హులకు సర్టిఫికేషన్‌ను ప్రవేశపెడుతోంది ఇన్ఫోసిస్‌. దీని రిజిస్ట్రేషన్‌ ఇన్ఫీ టీక్యూ పై ఉంటుంది. తేదీలను తర్వాత ప్రకటిస్తారు. 
ఈ  సర్టిఫికేషన్‌ పరీక్షలో 65 శాతం మించి స్కోరు చేసినవారు ఇన్ఫోసిస్‌లో ఎంట్రీ స్థాయి ఉద్యోగాల ఆన్‌ ది స్పాట్‌ జాబ్‌ ఇంటర్వ్యూలకు అర్హులవుతారు. ఇన్ఫీ టీక్యూ ప్లాట్‌ఫామ్‌పై ఇన్ఫోసిస్‌ సర్టిఫికేషన్‌కు రిజిస్టర్‌ చేసుకున్నవారికి ఇదో గొప్ప అవకాశమవుతుంది. 2020 బ్యాచ్‌ నుంచి విద్యార్థులు ఇన్ఫీ టీక్యూలో ఫౌండేషన్‌ కోర్సులు పూర్తిచేసుకునివుంటే సర్టిఫికేషన్‌ పరీక్షకు హాజరయ్యేటప్పుడు అదనపు ప్రయోజనం కలుగుతుంది. ఇతర విద్యార్థులైతే రిజిస్టర్‌ చేసుకుని, ఫౌండేషన్‌ కోర్సులు పూర్తి చేయాల్సివుంటుంది. 
సర్టిఫికేషన్‌ పరీక్షను అర్థం చేసుకునేందుకు మాక్‌ టెస్టుకు హాజరుకావొచ్చు, ఈ లింకులో- https://infytq.infosys.com/infosyscertification.


హ్యాక్‌ విత్‌ ఇన్ఫీకి ఉపయోగం 


విద్యార్థుల్లో కోడింగ్‌ ఆప్టిట్యూడ్‌ను పరీక్షించటానికి ఇన్ఫోసిన్‌ నిర్వహించే కోడింగ్‌ పోటీ - ‘హ్యాక్‌ విత్‌ ఇన్ఫీ’. దీనిలో పాల్గొనేవారిలో టాప్‌ 3,300 మందికి ఇన్ఫోసిస్‌లో  ప్రీ ప్లేస్‌మెంట్‌ ఇంటర్వ్యూ అవకాశం లభిస్తుంది. ఈ పోటీ మూడు దశల్లో జరుగుతుంది.
2020లో  బీఈ/బీటెక్‌; ఎంఈ/ఎంటెక్‌ కోర్సు పూర్తిచేసేవారు హ్యాక్‌ విత్‌ ఇన్ఫీకి అర్హులు. 
తొలి రౌండు: జూన్‌ 30, జులై 1, 2019 తేదీల్లో నిర్వహిస్తారు. ఇది ఆన్‌లైన్‌ ఛాలెంజ్‌గా ఉంటుంది.

రెండో రౌండు: జులై 14, జులై 15, 2019 తేదీల్లో. ఇది కూడా ఆన్‌లైన్‌ ఛాలెంజే.

మూడో రౌండు: ఇది గ్రాండ్‌ ఫినాలే. ఇది ఆగస్టు 16న మొదలై ఆగస్టు 19న ముగుస్తుంది. దీనికి ఇన్ఫోసిస్‌, పుణె వేదికగా ఉంటుంది. ఎంపికైన ఫైనలిస్టులకు ప్రయాణ, వసతి ఖర్చులను ఇన్ఫోసిస్‌ స్పాన్సర్‌ చేస్తుంది. 
ఇలాంటి కోడింగ్‌ పోటీలకు సిద్ధమవ్వటానికి ఇన్ఫీ టీక్యూ ఫౌండేషన్‌ కోర్సులు ఉపయోగపడతాయి. వీటితో పాటు  www.hackerrank.com, www.hackerearth.com, www.geeksforgeek.com, www.codechef.com, www.interviewbit.comలాంటి¨  కోడింగ్‌ ప్లాట్‌ఫారాల్లో సాధన చేయటం కూడా అవసరం. 
దీని రిజిస్ట్రేషన్‌ లింకు: https://infytq.infosys.com/hackathon- రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూన్‌ 20, 2019.


అత్యుత్తమ శిక్షణకు మార్గం 

అన్ని ఐటీ సంస్థలూ నియామకాల కోసం అభ్యర్థుల్లో ప్రధానంగా చూసేవి- కోడింగ్‌/ ప్రోగ్రామింగ్‌, డేటా బేస్‌, డేటా స్ట్రక్చర్, అల్గారిదమ్స్‌. దీంతోపాటు కమ్యూనికేషన్‌, సాఫ్ట్‌స్కిల్స్‌ను ప్రధానంగా పరీక్షిస్తాయి. ఇవన్నీ నేర్చుకోగలిగే అవకాశమిచ్చే ‘ఇన్ఫీ టీక్యూ’ ఉద్యోగ సాధనకు అత్యుత్తమ శిక్షణ వేదికగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఉద్యోగ ఇంటర్వ్యూకంటే ముందుగానీ, తర్వాత గానీ ఐటీ పరిశ్రమకి కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఇదో మంచి సాధనం. కొత్త టెక్నాలజీలు కంపెనీలకు ఎలా ఉపయోగపడతాయనేదానిపై అవగాహన ఐటీ విద్యార్థులకు ఎంతో ముఖ్యం. అలాంటి సమాచారం అందించి, పుల్‌స్టాక్‌ ఇంజినీర్‌కు అవసరమైన నైపుణ్యాలు దీని ద్వారా పెంచుకోవచ్చు. 
ఐటీ రంగంలో కోర్సులు నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులకు నాణ్యతతో ఉన్న కంటెంట్‌ చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ అందించే శిక్షణ కార్యక్రమాలు ఇన్ఫీ టీక్యూ ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. రకరకాల ఇంటర్న్‌షిప్స్‌, ఉద్యోగావకాశాలను ఇన్ఫోసిస్‌ ఈ వేదిక ద్వారా అందజేస్తోంది. ఈ నైపుణ్యాలు ఇన్ఫోసిస్‌లో మాత్రమే కాకుండా ఏ ఇతర కంపెనీల్లోనైనా ఉద్యోగాలు పొందటానికి చక్కగా ఉపయోగపడతాయి.

- పరుచూరి సతీష్‌చంద్ర,  డైరెక్టర్‌- ఇండస్ట్రీ రిలేషన్స్‌, బీవీఆర్‌ఐటీ, శ్రీవిష్ణు విద్యాసంస్థలు.

మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

శివమెత్తిన శివమ్‌ [21:02]

శివమ్‌ దూబే (54, 30 బంతుల్లో 3×4, 4×6) రాణించడంతో వెస్టిండీస్‌కు భారత్‌ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. భారత్‌కు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM [21:00]

మహిళలపై జరుగుతున్న దురాగతాలను అరికట్టడానికి కొత్త చట్టాలను తీసుకురావడమొక్కటే పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుకు రాజకీయ సంకల్పం, పాలనా నైపుణ్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇలాంటి...

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు [20:14]

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం  ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే...

మద్యాన్ని ఆదాయవనరుగా భావించం:ఏపీమంత్రి [20:06]

సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో

బాలయ్య సరసన రష్మి [19:54]

మాస్‌లో నందమూరి బాలకృష్ణకు ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్‌’. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు నటుడిగా ...

బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ [19:41]

ఉమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ హీట్‌ ఉమెన్‌ జట్టు నిలిచింది. వరుసగా రెండు సీజన్లో టైటిల్‌ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఉమెన్‌ జట్టుపై బ్రిస్బేన్‌ హీట్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం