హువావేపై నిషేధం: గూగుల్‌ భయపడిందా?

వాషింగ్టన్‌: చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ దిగ్గజం హువావేపై అమెరికా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత నిషేధాన్ని 90 రోజుల పాటు సడలిస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం భవిష్యత్‌లో అమెరికా కంపెనీలేవీ హువావేకు ఎలాంటి సహకారం అందించవు. ముఖ్యంగా గూగుల్‌ సేవలేవీ హువావేకు అందవు. అయితే, ఈ నిషేధంతో సెర్చింజన్‌ దిగ్గజం భయపడిందా? అందుకే ఇప్పుడు కొత్త పాట పాడుతోందా? అంటే నివేదికలు అవుననే చెబుతున్నాయి. హువావేపై నిషేధం కారణంగా లాభం కన్నా నష్టమే ఎక్కువని గూగుల్‌ భావిస్తోందట. అందుకే హువావేపై విధించిన నిషేధం నుంచి తమకు మినహాయింపునివ్వాలని ట్రంప్‌ సర్కారును అభ్యర్థిస్తోంది. ఇటీవల ప్రభుత్వం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిషేధం నుంచి గూగుల్‌కు మినహాయింపు ఇవ్వాలని గట్టిగా కోరింది. ఇందుకు కారణాలను కూడా ప్రభుత్వం ముందు ఉంచింది. 

నిషేధం నేపథ్యంలో హువావే ‘టైటాన్‌’ పేరు ఓ కొత్త ఓఎస్‌పై ఇప్పటికే కసరత్తులు చేస్తోంది. ఆండ్రాయిడ్‌ ఓపెన్‌ సోర్స్‌ అయినప్పటికీ నిషేధం కారణంగా గూగుల్‌ అందించే సేవలైన ప్లేస్టోర్‌, జీ-మెయిల్‌, యూట్యూబ్‌ వంటి సేవలు అందుబాటులోకి రావు. ఇక హువావే ఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాల్‌గా తమ యాప్‌ అందుబాటులో ఉండదని తాజాగా ఫేస్‌బుక్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌కు పోటీగా ‘టైటాన్‌’ ఓఎస్‌ను హువావే తయారు చేస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో ఇది రాబోతున్నట్లు టెక్‌ నిపుణులు చెబుతున్నారు. దీంతో గూగుల్‌ వెన్నులో ఒక్కసారిగా వణుకు పుట్టింది. ‘టైటాన్‌’ కనుక సక్సెస్‌ అయితే, ప్రపంచవ్యాప్తంగా తన ఏకఛత్రాధిపత్యానికి ఎక్కడ గండిపడుతోందనన్న ఆందోళన గూగుల్‌లో మొదలైంది. దీంతో హువావేపై నిషేధం విధించడం వల్ల తమకే అత్యధిక నష్టం కలిగే అవకాశం ఉందని గూగుల్‌ భావిస్తోందట. ఇదే విషయాన్ని ట్రంప్‌ సర్కారు ముందుంచింది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ సహా, ఇతర సేవల కోసం హువావే గూగుల్‌పై ఆధారపడటం అమెరికాకు లాభించే విషయమని ప్రభుత్వానికి వివరించింది. 

ఇప్పటికే చైనాకు చెందిన అన్ని మొబైల్‌ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌ కోసం గూగుల్‌ తయారు చేసిన ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ను వినియోగిస్తున్నాయి. ఈ ఓఎస్‌ను రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి అంతర్జాతీయంగా విడుదల చేసే మొబైల్స్‌కు గూగుల్‌ అందించే అన్ని యాప్స్‌ను యాక్సెస్‌ చేసుకునే వెసులుబాటునిస్తారు, మరో వెర్షన్‌ కేవలం చైనాకు సంబంధించిన యాప్స్‌ను మాత్రమే వినియోగించేలా తయారు చేస్తారు. ఒకవేళ చైనాతో అమెరికా సంబంధాలు పూర్తిగా దెబ్బతింటే ఈ ఫోన్లకు సంబంధించిన భద్రత, అప్‌డేట్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని గూగుల్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

మరోపక్క హువేవాపై నిషేధం కారణంగా అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌కు చైనాలో అమెరికా టెక్నాలజీ సంస్థల సేవలు నిలిచిపోతాయి. ఇది వ్యాపారపరంగా ఆయా కంపెనీలకు నష్టం కలిగించే అంశం. ఇందులో క్వాల్కమ్‌, మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌, యూకేకు చెందిన చిప్‌ డిజైనర్‌ ఏఆర్‌ఎం సహా పలు కంపెనీలు ఉన్నాయి. మరి గూగుల్‌ అభ్యర్థనపై ట్రంప్‌ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కాలమే నిర్ణయిస్తుంది.

మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....