అవును! యువీతో కఠినంగానే ప్రవర్తించా

ముంబయి: టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ పట్ల కఠినంగా ప్రవర్తించానని అతడి తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ అంగీకరించారు. యువీ సత్తా నిరూపించేందుకే అలా ప్రవర్తించాల్సి వచ్చిందని వెల్లడించారు. తన కొడుకుని చూసి గర్విస్తున్నానని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు యువీ సోమవారం వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

‘అలాంటి కొడుకు ఉన్నందుకు చాలా సంతోషం. అతడికి ధన్యవాదాలు చెబుతున్నాను. నువ్వు నాకెప్పటికీ గర్వకారణమే అని యువీకి చెబుతుంటాను. అతడి పట్ల కఠినంగా ప్రవర్తించానని యువీ అనుకుంటే అందుకో కారణం ఉంది. యువీ.. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా’ అని యోగ్‌రాజ్‌ తెలిపారు. తన తండ్రినెప్పుడూ యువరాజ్‌ డ్రాగన్‌గా భావించేవాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే ముందు మాట్లాడటం వల్ల తండ్రితో చనువు పెరిగిందని చెప్పాడు.

‘వీడ్కోలు గురించి నా తండ్రితో మాట్లాడినప్పుడే ఆయనతో నాకు శాంతి ఏర్పడింది. చిన్నప్పటి నుంచి అణచిపెట్టుకున్న భావాలను ఆయనతో పంచుకున్నా. అప్పుడు ఆయన తనవైపు కథ వినిపించారు. దాంతో నాకు ప్రశాంతత లభించింది. ఆ సంభాషణతో చనువు ఏర్పడింది. 20 ఏళ్లుగా నేను ఆ సంభాషణను ఆయనతో చేయలేదు. ఆయనెప్పుడూ నాకు డ్రాగన్‌గా కనిపించేవారు. డ్రాగన్‌ను ఎదుర్కోవడం చాలా పెద్ద పని’ అని యువీ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా మంచి క్రికెటర్‌గా ఎదిగేందుకు యువరాజ్‌ను ఎప్పుడూ ముంబయిలో ఆడాలని చెప్పేవాడినని యోగ్‌రాజ్‌ వెల్లడించారు. యువీని జాతీయ జట్టుకు ఎంపికచేసినప్పుడు సెలక్టర్‌గా ఉన్న చందూబోర్డే సైతం అతడిని కొనియాడాడు.

మరిన్ని

విద్యార్థినుల హాస్టల్‌లో డ్రోన్‌.. [00:12]

కెమెరా అమర్చిన ఓ డ్రోన్‌ రాత్రిళ్లు హాస్టల్‌లోని తమ గదుల దగ్గర తిరుగుతూ చిత్రీకరిస్తోందని హరియాణాకు చెందిన విద్యార్థినులు ఫిర్యాదు చేస్తే అది విమానమని కొట్టిపారేశారు ఆ యూనివర్సిటీ అధికారులు, స్థానిక పోలీసులు. దీంతో హాస్టల్‌ విద్యార్థినులు యూనివర్సిటీ గేట్‌ దగ్గర నిరసన

ఒకే మ్యాచ్‌లో 134 పరుగులు..8 వికెట్లు [00:16]

కన్నడ నాట జరుగుతున్న కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌(కేపీఎల్‌)లో బళ్లారీ టస్కర్స్‌ తరఫున ఆడుతున్న కృష్ణప్ప గౌతమ్‌ చరిత్ర సృష్టించాడు. బ్యాట్‌తోనూ, బంతితోనూ అదరగొట్టాడు. ప్రత్యర్థి జట్టు శివమొగ్గ లయన్స్‌కు చుక్కలు చూపించాడు. 56 బంతుల్లో......

రహానె అర్ధశతకం: భారత్‌ 174/3 [01:50]

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె రెండో ఇన్నింగ్‌లోనూ అర్ధశతకం అందుకున్నాడు....

నిలకడగా కోహ్లీ, రహానె: భారత్‌ 125/3 [00:53]

వెస్టిండీస్‌తో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ జోరు సాగిస్తున్నారు...

నేలరాలిన భాజపా ‘అరుణ్‌’తార..! [00:19]

అమృత్‌సర్‌ నుంచి అరుణ్‌ జైట్లీ పోటీ చేస్తున్నారనే విషయం తెలియగానే ఆ నియోజకవర్గంలో దాదాపు 40 భాజపా కార్యాలయాలు స్వచ్ఛందంగా తెరుచుకొన్నాయి..

జైట్లీ, సుష్మాల మధ్య పోలికలివే! [00:18]

నెల రోజుల వ్వవధిలో భారతీయ జనతా పార్టీ ఇద్దరు కీలక నేతలను కోల్పోయింది. ఈనెల 6న మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. తర్వాత  సరిగ్గా 18 రోజులకు మరో సీనియర్‌ నేత అరుణ్ జైట్లీ కూడా కన్నుమూశారు. వీరిద్దరికీ చాలా సారూప్యతలున్నాయి. ఇద్దరికీ స్నేహితులు చాలా ఎక్కువ. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. హాస్య చతురత ఎక్కువ. .....

జైట్లీ ‘అందరివాడు’.. [00:18]

కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ మృతిపై లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు......

ఆయన ప్రసంగాలు చిరస్మరణీయం.. [00:18]

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ తీవ్ర అనారోగ్యంలో దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పార్టీలో ముఖ్య నేతగా ఎదిగిన జైట్లీ.. పార్టీలోని వివిధ హోదాల్లో, కేంద్ర మంత్రిగా కీలక పాత్ర పోషించారు........

అర్థవంతమైన విమర్శలు ఆయనకే సొంతం.. [00:18]

కీలక నేత సుష్మాస్వరాజ్‌ను పోగొట్టుకొన్న దుఃఖాన్ని ఇంకా దిగమింగకముందే మరో ‘కమల’ తార నేల రాలింది. చరిత్రాత్మక సంస్కరణలు జీఎస్టీ, నోట్ల రద్దు సమయంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన గొప్ప.............

చైనాకు చాలదనుకుంటా.. డోసు పెంచండి..! [00:17]

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాకు టారీఫ్‌ల డోసు పెంచారు. అమెరికా వస్తువులపై టారీఫ్‌లు విధిస్తున్నట్లు చైనా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్‌ తన ట్విటర్‌...