మందకొడిగా ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు మందకొడిగా ముగిశాయి. సెన్సెక్స్‌ 15 పాయింట్ల నష్టంతో 39,741 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 11,914 వద్ద ముగిశాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 250 పాయింట్ల మేరకు కుంగి ఆ తర్వాత కోలుకొంది. నిఫ్టీ కూడా నేటి ట్రేడింగ్‌లో 78 పాయింట్ల వరకు నష్టపోయింది. సియట్‌ షేర్లు 52వారాల అత్యల్ప స్థాయికి చేరాయి. నేటి ట్రేడింగ్‌లో ఆ షేర్లు 4శాతం నష్టపోయాయి. ముడిసరుకుల ధరలు పెరగటం దీనికి ప్రధాన కారణం. ఇక యస్‌బ్యాంక్‌ షేర్లు 6శాతం కుంగి 40 నెలల కనిష్టానికి చేరింది.  చివర్లో 12శాతం కుంగి రూ.117 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. ఇక స్పైస్‌ జెట్‌షేర్లు 15 శాతం కుంగి జీవితకాల అత్యల్పానికి చేరాయి. జూన్‌ 28 నుంచి ఈ స్టాక్‌ను ట్రేడ్‌-టూ-ట్రేడ్‌ విభాగంలోకి చేర్చడం షేరు ధరపై ప్రభావం చూపింది. 
ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, జీఎంటర్‌టైన్‌మెంట్‌, బీపీసీఎల్‌, గ్రాసిమ్‌, పవర్‌గ్రిడ్‌లు లాభపడగా.. యస్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, ఇన్ఫోసిస్‌, ఐవోసీలు నష్టపోయాయి. 

 

మరిన్ని

విద్యార్థినుల హాస్టల్‌లో డ్రోన్‌.. [00:12]

కెమెరా అమర్చిన ఓ డ్రోన్‌ రాత్రిళ్లు హాస్టల్‌లోని తమ గదుల దగ్గర తిరుగుతూ చిత్రీకరిస్తోందని హరియాణాకు చెందిన విద్యార్థినులు ఫిర్యాదు చేస్తే అది విమానమని కొట్టిపారేశారు ఆ యూనివర్సిటీ అధికారులు, స్థానిక పోలీసులు. దీంతో హాస్టల్‌ విద్యార్థినులు యూనివర్సిటీ గేట్‌ దగ్గర నిరసన

ఒకే మ్యాచ్‌లో 134 పరుగులు..8 వికెట్లు [00:16]

కన్నడ నాట జరుగుతున్న కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌(కేపీఎల్‌)లో బళ్లారీ టస్కర్స్‌ తరఫున ఆడుతున్న కృష్ణప్ప గౌతమ్‌ చరిత్ర సృష్టించాడు. బ్యాట్‌తోనూ, బంతితోనూ అదరగొట్టాడు. ప్రత్యర్థి జట్టు శివమొగ్గ లయన్స్‌కు చుక్కలు చూపించాడు. 56 బంతుల్లో......

రహానె అర్ధశతకం: భారత్‌ 174/3 [01:50]

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె రెండో ఇన్నింగ్‌లోనూ అర్ధశతకం అందుకున్నాడు....

నిలకడగా కోహ్లీ, రహానె: భారత్‌ 125/3 [00:53]

వెస్టిండీస్‌తో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ జోరు సాగిస్తున్నారు...

నేలరాలిన భాజపా ‘అరుణ్‌’తార..! [00:19]

అమృత్‌సర్‌ నుంచి అరుణ్‌ జైట్లీ పోటీ చేస్తున్నారనే విషయం తెలియగానే ఆ నియోజకవర్గంలో దాదాపు 40 భాజపా కార్యాలయాలు స్వచ్ఛందంగా తెరుచుకొన్నాయి..

జైట్లీ, సుష్మాల మధ్య పోలికలివే! [00:18]

నెల రోజుల వ్వవధిలో భారతీయ జనతా పార్టీ ఇద్దరు కీలక నేతలను కోల్పోయింది. ఈనెల 6న మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. తర్వాత  సరిగ్గా 18 రోజులకు మరో సీనియర్‌ నేత అరుణ్ జైట్లీ కూడా కన్నుమూశారు. వీరిద్దరికీ చాలా సారూప్యతలున్నాయి. ఇద్దరికీ స్నేహితులు చాలా ఎక్కువ. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. హాస్య చతురత ఎక్కువ. .....

జైట్లీ ‘అందరివాడు’.. [00:18]

కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ మృతిపై లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు......

ఆయన ప్రసంగాలు చిరస్మరణీయం.. [00:18]

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ తీవ్ర అనారోగ్యంలో దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పార్టీలో ముఖ్య నేతగా ఎదిగిన జైట్లీ.. పార్టీలోని వివిధ హోదాల్లో, కేంద్ర మంత్రిగా కీలక పాత్ర పోషించారు........

అర్థవంతమైన విమర్శలు ఆయనకే సొంతం.. [00:18]

కీలక నేత సుష్మాస్వరాజ్‌ను పోగొట్టుకొన్న దుఃఖాన్ని ఇంకా దిగమింగకముందే మరో ‘కమల’ తార నేల రాలింది. చరిత్రాత్మక సంస్కరణలు జీఎస్టీ, నోట్ల రద్దు సమయంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన గొప్ప.............

చైనాకు చాలదనుకుంటా.. డోసు పెంచండి..! [00:17]

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాకు టారీఫ్‌ల డోసు పెంచారు. అమెరికా వస్తువులపై టారీఫ్‌లు విధిస్తున్నట్లు చైనా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్‌ తన ట్విటర్‌...