నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: ఆసియా మార్కెట్లు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.44గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 160 పాయింట్లు నష్టపోయి 39,580 వద్ద కొనసాగుతుండగా.. అదే సమయంలో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఎన్‌ఎస్‌ఈ 57 పాయింట్ల నష్టంతో 11,856 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.57 వద్ద కొనసాగుతోంది. 

దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో నమోదవుతుండడం గమనార్హం. కాగా, యస్‌ బ్యాంక్‌, హెక్సావేర్‌, బజాజ్‌ ఫినాన్స్‌, ఇడియా బుల్స్‌ హౌసింగ్‌, గెయిల్‌, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆర్‌ఐఎల్‌, ఐవోసీ, బీపీసీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, గృహ్‌ ఫినాన్స్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

మరిన్ని

భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు [00:05]

భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....