కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ

బెంగళూరు: ఎట్టకేలకు కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. అసంతృప్త ఎమ్మెల్యేలకు, సీనియర్‌లకు చోటు దక్కుతుందని కొద్దిరోజులుగా కథనాలు వెలుడుతున్నప్పటికీ ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల వైపే ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం మొగ్గు చూపింది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ వాజుభాయి వాలా స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్‌.శంకర్‌, హెచ్‌.నగేశ్‌లతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర కూడా హాజరయ్యారు. 
కుమారస్వామి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనూ శంకర్‌ మంత్రిగా పనిచేశారు. అయితే గత డిసెంబర్‌లో ఆయన అనూహ్యంగా మంత్రివర్గం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించి నగేశ్‌తో కలిసి భాజపా వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని భాజపా పడగొట్టే సూచనలేవీ కన్పించకపోవడంతో వీరిద్దరూ యూటర్న్‌ తీసుకొన్నట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఈ ఇద్దరి చేరిక పట్ల అప్పుడే అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే శంకర్‌ చేతిలో పరాజయం పాలైన మాజీ స్పీకర్‌ కేబీ కోలివాడ్‌ మాట్లాడుతూ..శంకర్‌ను అవకాశవాది అని విమర్శించారు. వాస్తవానికి జూన్‌ 12నే ఈ కార్యక్రమం జరగాల్సి ఉన్నప్పటికీ సినీనటుడు గిరీష్‌ కర్నాడ్‌ మృతి కారణంగా వాయిదా వేశారు. 

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌లు కలిసి పోటీ చేసినప్పటికీ రాష్ట్రంలోని 28స్థానాలకుగానూ చెరొక స్థానంలో మాత్రమే విజయం దక్కింది. ఈ ఫలితాలను జీర్ణించుకోలేని ఇరు పక్షాలు.. ముఖ్యంగా కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్‌ నేతలు తమ రాష్ట్ర నాయకత్వంపై, సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.

మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు! [21:31]

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు...

గచ్చిబౌలి స్టేడియంలో ‘వెంకీమామ’ సందడి [21:16]

అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ ఆదివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేశారు. ఇండియన్‌ సూపర్‌లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌ ఎఫ్‌సీ×ఎఫ్‌సీ...

శివమెత్తిన శివమ్‌ [21:02]

శివమ్‌ దూబే (54, 30 బంతుల్లో 3×4, 4×6) రాణించడంతో వెస్టిండీస్‌కు భారత్‌ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. భారత్‌కు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM [21:00]

మహిళలపై జరుగుతున్న దురాగతాలను అరికట్టడానికి కొత్త చట్టాలను తీసుకురావడమొక్కటే పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుకు రాజకీయ సంకల్పం, పాలనా నైపుణ్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇలాంటి...

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు [20:14]

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం  ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే...

మద్యాన్ని ఆదాయవనరుగా భావించం:ఏపీమంత్రి [20:06]

సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో