మాజీ ప్రధానులు లేని బడ్జెట్‌ సెషన్‌ ఇది

దిల్లీ: ఒకరేమో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. మరొకరి పదవికాలం నిన్నటితో ముగిసింది. ఫలితంగా మాజీ ప్రధానులు లేకుండానే 17వ లోక్‌సభ తొలి బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. 17వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్‌ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 5న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అయితే మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్‌ సింగ్‌ ఈ సమావేశాలకు దూరం కావడం గమనార్హం. 

భారత్‌కు 11వ ప్రధానిగా పనిచేసిన జేడీఎస్‌ నేత దేవెగౌడ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. గతంలో కర్ణాటకలోని హసన్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలిచిన దేవెగౌడ.. ఈ సారి మనవడు ప్రజ్వల్‌ రేవణ్న కోసం తన సీటును త్యాగం చేశారు. తుముకూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దేవెగౌడ.. భాజపా అభ్యర్థి బసవరాజ్‌ చేతిలో 13వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. దీంతో ఈ సారి ఆయన పార్లమెంట్‌కు వెళ్లలేకపోయారు. 

దాదాపు 30ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. దీంతో రానున్న బడ్జెట్‌ సమావేశాలకు ఆయన దూరం కావాల్సి వచ్చింది. మన్మోహన్‌ తొలిసారిగా 1991లో అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి అసోం నుంచి పెద్దల సభకు ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే ఈ సారి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కేవలం 25 మంది ఎమ్మెల్యేలే ఉండటంతో ఆయన ఎన్నిక సాధ్యమయ్యేలా కన్పించట్లేదు. ప్రస్తుతం రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్న ఒడిశా, తమిళనాడు, బిహార్‌, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి కూడా మన్మోహన్‌ను పంపడం కాంగ్రెస్‌కు సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. గుజరాత్‌ మినహా మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం లేదు. గుజరాత్‌లో ఉన్న బలంలో కనీసం ఒక్క సీటు మాత్రమే దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ సీటును మన్మోహన్‌కు కేటాయించే అవకాశం లేవని పలువురు నాయకులు అభిప్రాయడుతున్నారు. దీంతో మన్మోహన్‌ సింగ్‌ మళ్లీ పార్లమెంట్‌కు రావడం అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.  

మరిన్ని

13 అంతస్తుల భవనంపైకి ఎక్కి రైతుల నిరసన [13:36]

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ భవనంపైకి ఇద్దరు రైతులు ఎక్కడం ఆందోళన కలిగిస్తోంది. తుళ్లూరు, నెక్కల్లు గ్రామాలకు చెందిన కొందరు రైతులు నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మె్ల్యే క్వార్టర్స్‌ వద్ద

‘డమ్మీ కాన్వాయ్‌తో ట్రయల్‌ రన్‌..సిగ్గుచేటు’ [19:32]

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పెరిగే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ ఒప్పందం చేసుకున్నారని.. అందుకే అమరావతిని చంపేస్తున్నారని...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [20:54]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

కశ్మీర్‌లో ఇంటర్నెట్ ఆ సినిమాలు చూసేందుకే కదా! [23:52]

జమ్ముకశ్మీర్లో ఆర్టికల్‌ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడ ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడాన్ని నీతిఆయోగ్‌ సభ్యుడు, జేఎన్‌యూ ఛాన్సలర్‌ వీకే సరస్వత్‌ సమర్థించుకున్నారు. ఆ ప్రాంతంలో అంతర్జాలాన్ని నిలిపివేయడం వల్ల పెద్దగా నష్టమేమీలేదని ఆయన అన్నారు.  ‘‘ కశ్మీర్లో  ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నప్పుడు, లేనప్పుడు ఏం తేడా కనిపించింది.  అక్కడ ఇంటర్నెట్లో ఏం చూస్తారు...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం [23:44]

గుజరాత్‌ రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లా ఘోర దేవ్‌పరా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలవగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వీరంతా గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [23:38]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు ఉన్నారని, ప్రభుత్వానికి తమ ఆకాంక్షలను తెలియజేయాలనుకున్న తరుణంలో ఈ విధమైన అణిచివేత చర్యలు...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [23:32]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

తెదేపా నేతల గృహనిర్బంధం [23:24]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

రాజధాని కోసం ఆగిన మరో గుండె [23:19]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

దీపికపై అభిమానుల ఫైర్‌ [23:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...