సూర్యపై మోహన్‌బాబు ప్రశంసలు

హైదరాబాద్‌: కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు.. ప్రముఖ నటుడు సూర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సూర్య కథానాయకుడిగా ‘సూరారై పొట్టూర్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి మోహన్‌బాబుతో కలిసి పనిచేయడం గురించి సూర్య ట్విటర్‌ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు.
‘మోహన్‌బాబు సర్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి. ఆయన డిసిప్లైన్‌ ఉన్న లెజెండ్‌. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన సినీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు. ‘సూరారై పొట్టూర్‌’ చిత్రంలో భాగమైనందుకు ధన్యవాదాలు మోహన్‌బాబు సర్‌’ అని పేర్కొన్నారు. 

ఇందుకు మోహన్‌బాబు స్పందిస్తూ.. ‘నా గురించి చక్కటి మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు సూర్య. ఈ తరం గొప్ప స్టార్‌ అయివుండి సెట్స్‌లో నువ్వు చూపించే నిబద్ధతే చెబుతోంది నీది ఎంత చక్కటి స్వభావమో. తర్వాతి షెడ్యూల్‌ కోసం ఎదురుచూస్తున్నాను మై యంగ్‌ ఫ్రెండ్‌’ అని ట్వీట్‌ చేశారు మోహన్‌బాబు.

మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....