‘మోదీ, మోదీ’ అంటూ దద్దరిల్లిన లోక్‌సభ

 

దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఏ రాజకీయ నాయకుడికి లేనంత ఇమేజ్‌ ఉంది. ఇంటా బయటా ఆయనకు లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. ఈ విషయం సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి రుజువైంది. అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరవాత పదిహేడో లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మోదీ మీద అభిమానాన్ని నేతలు బయటపెట్టుకున్నారు. తొలుత ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్  మోదీతో లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం  చేయించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగా లోక్‌సభలోని నేతలంతా ‘మోదీ, మోదీ’ అంటూ గట్టిగా బల్లలుచరుస్తూ ఆయన్ను అభినందించారు.  ‘భారత్ మాతాకీ జై’ అంటూ కూడా సభ్యులు నినాదాలు చేశారు. 

 మోదీ తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నుంచి సురేశ్ కొడికున్నిల్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌ షా తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ముందు కేంద్ర మంత్రులు, ప్యానెల్ ఛైర్మన్లు, ఆ తర్వాత ఆంగ్ల అక్షరమాల క్రమంలో రాష్ట్రాల వారీగా ఎంపీల ప్రమాణాలు జరుగుతాయి. 

మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు [20:14]

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం  ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే...

మద్యాన్ని ఆదాయవనరుగా భావించం:ఏపీమంత్రి [20:06]

సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో

బాలయ్య సరసన రష్మి [19:54]

మాస్‌లో నందమూరి బాలకృష్ణకు ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్‌’. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు నటుడిగా ...

బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ [19:41]

ఉమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ హీట్‌ ఉమెన్‌ జట్టు నిలిచింది. వరుసగా రెండు సీజన్లో టైటిల్‌ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఉమెన్‌ జట్టుపై బ్రిస్బేన్‌ హీట్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం

చట్టాల సవరణలకు సంకల్పించాం: అమిత్‌షా [19:29]

హత్యాచారం వంటి తీవ్ర నేరాల్లో న్యాయం ఆలస్యం అవుతుండడంతో ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను సవరించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు.

కరణ్‌ డైరెక్షన్‌లో ఆ జోనర్‌లో నటించాలని ఉంది [19:16]

ఈ ఏడాది విడుదలైన ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి కియారా ఆడ్వాణీ. ప్రస్తుతం ఆమె కరణ్‌ జోహార్‌ నిర్మాతగా...