‘పార్లమెంట్‌లోనే ఉన్నా.. నేనెవర్నీ కలవలేదు’

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్య

దిల్లీ: తన దిల్లీ పర్యటనలో ప్రత్యేకతేమీ లేదని.. పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి స్పష్టంచేశారు. తాను పార్టీ మారితే ముందుగా తెలియజేస్తానని చెప్పారు. తెలంగాణలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం సృష్టించాయి. ఆయన భాజపాలో చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌ రెడ్డి సోమవారం దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఉదయం నుంచీ పార్లమెంట్‌లోనే ఉన్నానని.. ఎవరినీ కలవలేదని చెప్పారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని తాను దిల్లీకి వచ్చినట్టు తెలిపారు. దిల్లీలో భాజపా నేతలను కలుస్తున్నాననే వార్తల్లో నిజం లేదన్నారు. తాను పార్టీ మారుతున్నాననే వార్తలు అవాస్తవమన్నారు. పార్టీ మారాల్సి వస్తే కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు.

పీసీసీ పదవి నాకు ఇచ్చి ఉంటే..
తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితిపై తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చి కూడా రెండుసార్లు అధికారం కోల్పోయామంటే అందుకు అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే కారణమని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు కష్టాల్లో ఉన్నారని.. సరైన నిర్ణయాలు తీసుకోనందునే 12 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారన్నారు. తనకు పీసీసీ పదవి ఇచ్చి ఉంటే పార్టీకి ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. తెరాసకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ పనిచేసే పరిస్థితి కనబడట్లేదని వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకత్వం బలంగా లేదన్నారు. అధిష్ఠానం తప్పుడు నిర్ణయాల వల్ల అధికారాన్ని కోల్పోయినట్టు చెప్పారు. కార్యకర్తల తప్పేం లేదని, కాంగ్రెస్‌కు క్యాడర్‌ ఉందన్నారు. కేసీఆర్‌ గొప్పతనం లేకపోయినా మళ్లీ అధికారంలోకి వచ్చారన్నారు. గత హామీలు నెరవేర్చకపోయినా అధికారంలోకి వచ్చారంటే కాంగ్రెస్‌ వైఫల్యమే కారణమని ఆరోపించారు. తెదేపాతో పొత్తు, టికెట్ల పంపిణీ సరిగా చేయలేదని ఆరోపించారు.  

రాజగోపాల్‌ రెడ్డికి షోకాజ్‌ నోటీసులు సిద్ధం?
కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి కాంగ్రెస్‌ క్రమశిక్షణా సంఘం సిద్ధమైంది. ఇటీవల కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయాలను తప్పుపడుతూ రాజగోపాల్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో క్రమశిక్షణా సంఘం  షోకాజ్‌ నోటీసులు సిద్ధం చేసింది. పార్టీ వ్యవహారాల ఇంఛార్జి ఆర్‌సీ కుంతియా, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరిశీలనకు పంపింది.  

మరిన్ని

13 అంతస్తుల భవనంపైకి ఎక్కి రైతుల నిరసన [13:36]

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ భవనంపైకి ఇద్దరు రైతులు ఎక్కడం ఆందోళన కలిగిస్తోంది. తుళ్లూరు, నెక్కల్లు గ్రామాలకు చెందిన కొందరు రైతులు నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మె్ల్యే క్వార్టర్స్‌ వద్ద

‘డమ్మీ కాన్వాయ్‌తో ట్రయల్‌ రన్‌..సిగ్గుచేటు’ [19:32]

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పెరిగే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ ఒప్పందం చేసుకున్నారని.. అందుకే అమరావతిని చంపేస్తున్నారని...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [20:54]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

కశ్మీర్‌లో ఇంటర్నెట్ ఆ సినిమాలు చూసేందుకే కదా! [23:52]

జమ్ముకశ్మీర్లో ఆర్టికల్‌ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడ ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడాన్ని నీతిఆయోగ్‌ సభ్యుడు, జేఎన్‌యూ ఛాన్సలర్‌ వీకే సరస్వత్‌ సమర్థించుకున్నారు. ఆ ప్రాంతంలో అంతర్జాలాన్ని నిలిపివేయడం వల్ల పెద్దగా నష్టమేమీలేదని ఆయన అన్నారు.  ‘‘ కశ్మీర్లో  ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నప్పుడు, లేనప్పుడు ఏం తేడా కనిపించింది.  అక్కడ ఇంటర్నెట్లో ఏం చూస్తారు...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం [23:44]

గుజరాత్‌ రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లా ఘోర దేవ్‌పరా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలవగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వీరంతా గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [23:38]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు ఉన్నారని, ప్రభుత్వానికి తమ ఆకాంక్షలను తెలియజేయాలనుకున్న తరుణంలో ఈ విధమైన అణిచివేత చర్యలు...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [23:32]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

తెదేపా నేతల గృహనిర్బంధం [23:24]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

రాజధాని కోసం ఆగిన మరో గుండె [23:19]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

దీపికపై అభిమానుల ఫైర్‌ [23:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...