అంబానీపై చైనా ఒత్తిడి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచానికే రుణదాతగా మారిన చైనా ఇప్పుడు అంబానీకి కూడా అప్పులు ఇచ్చింది. ఒక రకంగా అనిల్‌అంబానీకి చెందిన ఆర్‌కామ్‌కు అతిపెద్ద రుణదాతగా చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నిలిచింది. నిన్న ఆర్‌కామ్‌ దివాల ప్రక్రియలో భాగంగా రుణదాతల జాబితాను విడుదల చేసింది. ఇక మిగిలిన బ్యాంకులతో కలిపి మొత్తం 2.1బిలియన్‌ డాలర్లను చైనాకు చెందిన బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాలని ఆయా బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. ఆర్‌కామ్‌ చెల్లించాల్సిన అప్పుల విలువ రూ.57,382 కోట్లుగా ఈ జాబితాలో పేర్కొన్నారు. 

చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంకుకు రూ.9,860 కోట్లు చెల్లించాలి. ఎక్సిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు రూ.3,360 కోట్లు, ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు రూ.1,554 కోట్లు చెల్లించాలి. 
ఇప్పటికే అప్పులు తిరిగి చెల్లించేందుకు అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ ఆస్తులను రూ.17,300 కోట్లకు జియోకు విక్రయించేలా డీల్‌ చేసుకొన్నారు. కానీ, వివిధ న్యాయ, ఇతర అంశాలతో ఈ డీల్‌ నిలిచిపోయింది. మార్చిలో అనిల్‌ అంబానీ జైలు శిక్షను ఎదుర్కొనే పరిస్థితి రావడంతో ఆయన సోదరుడు ముఖేష్‌ రంగంలోకి దిగి 80 మిలియన్‌ డాలర్లను ఎరిక్సన్‌కు చెల్లించారు. 
జాబితాలో మరిన్ని విదేశీ బ్యాంకులు..
రష్యాకు చెందిన బీటీబీ క్యాపిటల్‌ ఆఫ్‌ రష్యాకు రూ.511 కోట్లు చెల్లించాలి. స్టాండర్డ్‌ ఛార్టర్డ్ బ్యాంక్‌(లండన్‌), డాయిష్‌ బ్యాంక్‌(హాంగ్‌కాంగ్‌),డీబీఎస్‌ బ్యాంక్‌, ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ బ్యాంక్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.   ఇక భారత్‌కు చెందిన బ్యాంకులు ఇచ్చిన రుణాలను చూస్తే ఎస్‌బీఐకు రూ.4,910, ఎల్‌ఐసీకు 4,760 కోట్లు చెల్లించాలి.

మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....