మసకబారుతున్న ‘మేడిన్‌ చైనా’ ..!

 సైకిళ్ల తయారీ దిగ్గజం ‘జెయింట్‌’ వెల్లడి

బీజింగ్‌: ‘‘మేడిన్‌ చైనా’ యుగం ఇక ముగిసింది’.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. ప్రపంచంలోనే అత్యధికంగా సైకిళ్లను తయారు చేసే జెయింట్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ కో సంస్థ అధ్యక్షురాలు బొన్నె టూ. అమెరికాకు చెందిన ఆర్డర్ల కోసం పనిచేసే తయారీ కేంద్రాన్ని కూడా తైవాన్‌కు మార్చనున్నట్లు తెలిపారు. ‘‘మేడిన్‌ చైనా’ శకం ముగియటాన్ని గత ఏడాది గమనించాను. ప్రపంచానికి పంపిణీదారుగా చైనా పాత్ర ముగుస్తోంది.’’ అని బొన్నె టూ అన్నారు. గత ఏడాది ట్రంప్‌ 25శాతం టారీఫ్‌లు విధిస్తానని వెల్లడించగానే ఈ సంస్థ అప్రమత్తమైంది. చైనా నుంచి వలసపోతున్న అతిపెద్ద సంస్థల్లో ‘జెయింట్‌ ’ కూడా ఒకటి. ఇప్పటికే జెయింట్‌ సంస్థ  చైనాలోని మౌంటేన్‌ అండ్‌ రేసింగ్‌ సైకిళ్ల తయారీ ప్లాంట్‌ను హంగేరికి తరలించింది. ఇప్పటికే జెయింట్‌కు తైవాన్‌, నెదర్లాండ్ల్‌లలో ప్లాంట్లు ఉన్నాయి. ఇవికాక చైనాలో మరో ఐదు ప్లాంట్లు ఉన్నాయి. దక్షిణాసియాలో ఒక భాగస్వామి కోసం చూస్తున్నట్లు జెయింట్‌ తెలిపింది. 
చైనాలో ఒక సైకిల్‌ తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేయాలంటే  100 డాలర్ల వరకు టారీఫ్‌ చెల్లించాల్సి ఉంటుంది. అదే జీరో టారీఫ్‌ దేశాల నుంచి ఎగుమతి చేస్తే ఆమేరకు మిగులుతుంది. దీంతో ఆ సంస్థ తైవాన్‌కు వెళ్లనుంది. కాకపోతే తైవాన్‌లో ఉద్యోగులకు వేతనాలు ఎక్కవగా ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి తోడు విడిభాగాల సరఫరా కూడా అంత వేగంగా ఉండదు. చైనా-అమెరికా ట్రేడ్‌వార్‌లో నలిగిపోయే కంటే ఈ సమస్యలు ఏమంత పెద్దవి కావని జెయింట్‌ అభిప్రాయపడుతోంది.
జెయింట్‌ బాటలో మరికొన్ని సంస్థలు కూడా పయనించనున్నాయి. ఇంటెల్‌ కార్ప్‌ తన సరఫరాదారుల విషయంలో మరోసారి సమీక్షిస్తానని పేర్కొంది. దీంతోపాటు లిఅండ్‌ఫుంగ్‌ కార్ప్‌ సంస్థ కూడా వాణిజ్య యుద్ధం తమను చైనా నుంచి మరోవైపునకు వెళ్లేలా చేస్తోందని ప్రకటించింది. 

భారత్‌కు 200 కంపెనీలు..

భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో చైనాకు చెందిన 200 సంస్థలు భారత్‌కు వలసపోయే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ది యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ అండ్‌ పార్టనర్‌షిప్‌ ఫర్మ్స్‌ అధ్యక్షుడు ముఖేష్‌ అఘీ ఇటీవల పేర్కొన్నారు. రాబోయే 12-18 నెలల్లో కేవలం భారత్‌లో కొన్ని విధాన పరమైన మార్పులు తీసుకొస్తే భారీ సంఖ్యలో కంపెనీలు వలస వస్తాయని తెలిపారు. సంస్కరణలు, అనుమతులు వంటి వాటిని వేగవంతం చేయాలన్నారు.

మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....