మోదీని ప్రతిదానికీ పిలవాలా?: కేసీఆర్‌ వ్యాఖ్య

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారు. ప్రతీ ఘట్టానికీ ఆహ్వానించాల్సిన అవసరం లేదని, గతంలో మిషన్‌ భగీరథ ప్రారంభోత్సవానికి పిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం నుంచి ఒక్కపైసా అదనంగా రాలేదని విమర్శించారు. ‘‘ప్రతిదానికీ ప్రధానిని పిలుస్తామా? అన్నింటికీ పిలవాలా? సంతృప్తిగా నేను ప్రారంభోత్సవం చేస్తున్నా మీకు ఇష్టంలేదా. మేం ఎన్డీయేలో భాగస్వాములం కాదు.. ప్రపంచానికి తెలుసు. ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం నేను పనిచేశాను. రాజ్యాంగపరమైన సంబంధాలు కేంద్రంతో ఎలా కొనసాగించాలో చేస్తాం. లేనివి ఎందుకు?గతంలో మోదీ ప్రధాని అయ్యాక అతి కఠినంగా నిందించిన వ్యక్తిని నేను. ఏడు మండలాలు, సీలేరు పవర్‌ ప్లాంటు ఏపీకి ఇచ్చినప్పుడు ఫాసిస్టు పీఎం అని అన్నాను. కేంద్రం నుంచి మాకు ఒక్క రూపాయి కూడా అదనపు సౌకర్యం ఇవ్వలేదు. మిషన్‌ భగీరథ, కాకతీయకు కలిపి రూ.24వేల కోట్లు ఇవ్వాలని మేం కోరితే ఒక్క రూపాయీ ఇవ్వలేదు. భాజపా జాతీయ అధ్యక్షుడు  అమిత్‌షా అబద్ధాలు మాట్లాడితే ఆయనను క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశాను. కేంద్ర ప్రభుత్వానికి మేం అంశాల వారీగా మద్దతు ఇచ్చాం. నచ్చిన వాటికి మద్దతిచ్చాం..నచ్చని వాటిని వ్యతిరేకించాం’’ అన్నారు.

‘‘ కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్‌ ఇరిగేషన్‌ పథకం ఇది. 45లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. రాష్ట్రంలో 80శాతం ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరందుతుంది. రాష్ట్రం సొంత నిధులు, బ్యాంకుల సహకారంతో ప్రజాఎక్టు నిర్మిస్తున్నాం. 24గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మాది. రాష్ట్రంలో ఎక్కడా బిందెల ప్రదర్శనలేదు. 2004లో బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేసి 15ఏళ్లు గడిచినా అతీగతీలేదు. ట్రైబ్యునల్‌ తీర్పు ఇవ్వడానికే ఇంతకాలం పడితే ప్రాజెక్టులు ఎప్పుడు కట్టాలి? తెలంగాణలో ప్రాజెక్టుల కోసం అహోరాత్రులు శ్రమించాను. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పరుగులు పెట్టిస్తాం. రేపు అఖిలపక్ష పార్టీల అధ్యక్షుల భేటీకి కేటీఆర్‌ హాజరవుతారు’’ అని కేసీఆర్‌ వెల్లడించారు.


మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....