పెళ్లి నుంచి తిరిగివస్తూ అనంతలోకాలకు..

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి

సంభల్‌: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోరదాబాద్‌-ఆగ్రా జాతీయ రహదారిపై మినీ వ్యాన్‌.. గూడ్స్‌ ట్రక్కు ఢీకొని 8 మంది దుర్మరణం చెందారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

లెహ్రావాన్‌ గ్రామ సమీపంలో సరుకులు మోసుకెళ్తున్న వాహనాన్ని మినీ వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. బాధితులు వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కాగా.. ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. 


మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

అరుదైన ఫొటోలు ట్వీట్‌ చేసిన కేటీఆర్‌ [21:58]

ఎప్పుడూ అధికారిక, పార్టీ కార్యక్రమాలతో బిజీగా గడిపే మంత్రి కేటీఆర్.. ట్విటర్‌లోనూ యాక్టివ్‌గా ఉంటారు. అభివృద్ధి, రాజకీయ

త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్‌ [21:46]

భాగ్యనగర వాసులకు మరో మెట్రో రైలు కారిడార్‌ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే హైదరాబాద్‌ వాసులకు మొదటి కారిడార్‌ మియాపూర్‌ నుంచి...

త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు! [21:31]

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు...

గచ్చిబౌలి స్టేడియంలో ‘వెంకీమామ’ సందడి [21:16]

అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ ఆదివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేశారు. ఇండియన్‌ సూపర్‌లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌ ఎఫ్‌సీ×ఎఫ్‌సీ...

శివమెత్తిన శివమ్‌ [21:02]

శివమ్‌ దూబే (54, 30 బంతుల్లో 3×4, 4×6) రాణించడంతో వెస్టిండీస్‌కు భారత్‌ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. భారత్‌కు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM [21:00]

మహిళలపై జరుగుతున్న దురాగతాలను అరికట్టడానికి కొత్త చట్టాలను తీసుకురావడమొక్కటే పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుకు రాజకీయ సంకల్పం, పాలనా నైపుణ్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇలాంటి...

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.