భారీగా పతనమైన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు

ముంబయి: జెట్‌ఎయిర్‌వేస్‌ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. నేటి ఉదయం ట్రేడింగ్‌ మొదలైనప్పటి నుంచి 29శాతం కుంగాయి. దీంతో ఒక దశలో జీవనకాల కనిష్ఠమైన రూ.28.60 వద్దకు చేరింది. నేడు ఈ కంపెనీ భవిష్యత్తుపై ఎన్‌సీఎల్‌టీలో విచారణ ఉండటంతో మదుపరులు భారీగా ఈ కంపెనీ షేర్లను విక్రయించేస్తున్నారు. ఎస్‌బీఐ నేతృత్వంలోని రుణదాతల కమిటీ మంగళవారం ముంబయి ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ దాఖలు చేసింది. అశీష్‌ ఛవ్చరియాను ఇంటీరియం రిసొల్యూషన్‌ ప్రొఫెషనల్‌గా (ఐఆర్‌పీ)గా ఎంపక చేశారు. దీంతో ఆయన కంపెనీకి చెందిన యాజమాన్య హక్కులు, విమానాల లీజుల వివరాలు, ఉద్యోగుల సమాచారం, ఆస్తులు, అప్పుల విలువను లెక్కగట్టాల్సి ఉంది. గత వారంలో కంపెనీ షేర్లు 74శాతం కుంగాయి. దీంతో జూన్‌ 28 నుంచి కంపెనీ షేర్లను ట్రేడ్‌-టూ-ట్రేడ్‌ విభాగంలోకి చేర్చారు. ఆడిట్‌ డిక్లరేషన్‌పై వచ్చి న వదంతుల విషయంలో కంపెనీ నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో స్టాక్‌ ఎక్స్‌ఛేంజీలు ఈ నిర్ణయం తీసుకొన్నాయి.

మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

వేషం అడగడానికి వెళ్తే.. ‘గెట్‌ అవుట్‌’ అన్నారు! [09:40]

కొన్ని తారలు తళుక్కున మెరుస్తాయి. ఈయన మాత్రం సినీ వినీలాకాశంలో తళతళా మెరుస్తూనే ఉంటారు. సముద్రమంత అనుభవం..

పెళ్లికి నిరాకరించినందుకు వేధింపులు [09:34]

పరిచయాన్ని ఆసరాగా తీసుకొని ఓ మహిళను పెళ్లి చేసుకోమని వేధించాడు.. ఆమె నిరాకరించేసరికి తీరని వేదన కలిగించాడు....

‘ఏ చట్టం ప్రకారం చిదంబరానికి నోటీసులిచ్చారు’ [09:27]

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో కాంగ్రెస్ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని రెండు గంటల్లోగా దర్యాప్తు అధికారుల ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన..............

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................