అరకోటి పనికి రూ.2 లక్షలు ఇవ్వలేవా?

లంచం అడుగుతూ వీడియోలో దొరికిన  దివ్యాంగుల శాఖాధికారి 
విచారణకు ఆదేశించిన ప్రకాశం కలెక్టర్‌

ఒంగోలు: దివ్యాంగ సంక్షేమ శాఖ ద్వారా నడిచే వృద్ధుల డేకేర్‌ కేంద్రాల అనుమతుల కోసం లంచం అడుగుతూ ప్రకాశం జిల్లా దివ్యాంగ సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు అడ్డంగా దొరికిపోయారు. ‘రూ.50 లక్షల ప్రాజెక్టుకు రూ.రెండు లక్షలు ఇవ్వలేవా? నువ్వు ఇలా చెప్పుకొనే రెండు నెలలు వృథా చేసుకున్నావు. పది రూపాయలు వచ్చే పనిలో ఐదు రూపాయలు వదులుకోవాలి. నువ్వు చెప్పిన విధంగానే పరిశీలించాను, నివేదిక ఇచ్చాను. సరే ఒకటి (లక్ష) ఇవ్వు’ అంటూ ఆ అధికారి మాట్లాడినదంతా వీడియోలో రికార్డ్‌ అయింది. సాక్షాత్తూ ప్రభుత్వ కార్యాలయంలోనే లంచం బేరాలు నడవడం గమనార్హం. ప్రసాద్‌ అనే వ్యక్తి డేకేర్‌ కేంద్రాల నిర్వహణకు అనుమతులు కోరుతూ ఆ శాఖ సహాయ సంచాలకులు సింగయ్య చుట్టూ రెండు నెలలుగా తిరుగుతున్నారు. రూ.రెండు లక్షలు ఇస్తేనే పని చేస్తానని చెప్పడంతో విసిగిపోయిన ప్రసాద్‌ సెల్‌ఫోన్‌లో వీడియో కెమెరా ఆన్‌ చేసి ఆ అధికారితో లంచం విషయమై మాట్లాడారు. అధికారికి తెలియకుండానే మొత్తం రికార్డ్‌ చేశారు. దాన్ని నేరుగా జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌కు పంపించారు. దీనిపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో సింగయ్య సెలవు పెట్టి వెళ్లిపోయారు. సెల్‌ఫోన్‌లో కూడా అందుబాటులోకి రావడం లేదు. ఈ అధికారిపై గతంలోనే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. దివ్యాంగ సమాఖ్య ప్రతినిధులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.


మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

మరోసారి చిదంబరం ఇంటికి సీబీఐ బృందం [10:01]

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ వెంటాడుతోంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఆయన దాఖలు......

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు [09:52]

దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాల్లో నమోదవుతున్నాయి. ఉదయం 9.40గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 70 పాయింట్లు నష్టపోయి 37,257 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌.............

మాజీ మంత్రి కన్నుమూత [09:48]

తెదేపా మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. గుండెపోటు రావడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా...

వేషం అడగడానికి వెళ్తే.. ‘గెట్‌ అవుట్‌’ అన్నారు! [09:40]

కొన్ని తారలు తళుక్కున మెరుస్తాయి. ఈయన మాత్రం సినీ వినీలాకాశంలో తళతళా మెరుస్తూనే ఉంటారు. సముద్రమంత అనుభవం..

పెళ్లికి నిరాకరించినందుకు వేధింపులు [09:34]

పరిచయాన్ని ఆసరాగా తీసుకొని ఓ మహిళను పెళ్లి చేసుకోమని వేధించాడు.. ఆమె నిరాకరించేసరికి తీరని వేదన కలిగించాడు....

‘ఏ చట్టం ప్రకారం చిదంబరానికి నోటీసులిచ్చారు’ [09:27]

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో కాంగ్రెస్ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని రెండు గంటల్లోగా దర్యాప్తు అధికారుల ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన..............

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......