ఏఎన్‌-32 దుర్ఘటన: 6 మృతదేహాలు లభ్యం

మరో ఏడుగురి శరీరభాగాలు కూడా..

సియాంగ్‌(అరుణాచల్‌ ప్రదేశ్‌): ఈనెల 3వ తేదీన జరిగిన వాయుసేనకు చెందిన ఏఎన్‌‌-32 విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్‌ జిల్లా పయూమ్‌ పరిధిలో ఇది కూలిపోయింది. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో మృతదేహాలను వెలికి తీయడానికి ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు ఆరు మృత దేహాలు, మరో ఏడుగురి శరీర భాగాలను గుర్తించారు. విమానం కూలిపోయిన ప్రాంతంలో వాతావరణం అనుకూలించలేదు. దీంతో అక్కడికి వెళ్లిన గరుడ్‌ కమాండోలకు అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మృతదేహాను గుర్తించడం కోసం వారితోపాటు  పోర్టర్లు, వేటగాళ్లు కూడా పర్వతం మీదకు నడుకుచుంటూ వెళ్లారు. ఎట్టకేలకు గురువారం నాటికి ఇందులో పురోగతి లభించింది.

జూన్‌ 3న మధ్యాహ్నం 12.25గంటలకు అసోంలోని జోర్హాట్‌ వైమానిక స్థావరం నుంచి బయలుదేరి కొద్దిసేపటికే ఏఎన్‌-32 విమానం ఆచూకీ లభించలేదు. ఇది అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మారుమూల ఉన్న మెచుకా అడ్వాన్స్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌కు చేరుకోవాల్సి ఉండగా, సియాంగ్‌ జిల్లా పయూమ్‌ పరిధిలో కూలిపోయింది. ఎనిమిది మంది సిబ్బంది, ఐదుగురు ఇతర ప్రయాణికులతో సహా మొత్తం 13మంది ఇందులో ప్రయాణిస్తున్నారు. గత కొద్ది రోజులుగా భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)తో పాటు, ఆర్మీ కూడా ఈ విమానం గురించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్‌ సాయంతో విమానం ఆచూకీ కోసం వెతుకుతుండగా సియాంగ్‌ జిల్లాలో గుర్తించారు. ఇందులో ప్రయాణిస్తున్న వారంతా మృతిచెందారని కొన్ని రోజుల క్రితం వైమానిక దళం వెల్లడించింది.

మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....