టాప్‌ 10 న్యూస్‌ - 1PM

1. నవభారతానికి నిబద్ధతతో కృషి: కోవింద్‌

‘అందరితో కలిసి.. అందరికీ వికాసం.. అందరి విశ్వాసం (సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌)’ అనే నినాదం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి ఆయన నేడు ప్రసంగించారు. ఈ సందర్భంగా లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లాను అభినందించారు. నవ భారత నిర్మాణం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలి

ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెద్దసంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ముఖ్యంగా మహిళలు.. పురుషులతో పోటీ పడి మరీ పోలింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. లోక్‌సభకు నూతనంగా ఎన్నికైన సభ్యులకు, ఏకగ్రీవంగా ఎన్నికైన స్పీకర్‌కు తన అభినందనలు తెలిపారు. దేశాభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని ఎంపీలకు సూచించారు. నవభారత నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు. 

3. ‘పోలవరం’ సందర్శించిన ఏపీ సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం చేరుకున్న సీఎం విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వ్యూ పాయింట్‌కు   చేరుకుని ప్రాజెక్టును పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు జలవనరులశాఖ మంత్రి, ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు పర్యటనలో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ‘కాళేశ్వరం’ సమగ్ర సమాచారం వెబ్‌సైట్‌లో పెట్టాలి: భట్టి

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం ఉదయం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు డీపీఆర్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరితే ఇంతవరకు బయటపెట్టలేదన్నారు. ప్రాజెక్టు సమగ్ర సమాచారం వెబ్‌సైట్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. 15 శాతం నిర్మాణానికే రూ.50 వేల కోట్లు ఖర్చయితే మొత్తం ప్రాజెక్టు పూర్తికావడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. పోలీసుల లాఠీచార్జ్‌..ఎమ్మెల్యేకు గాయాలు

పాతబస్తీలోని జుమ్మెరాత్ బజార్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధురాలు, రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేందుకు ఓ వర్గం ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆందోళనకు దిగారు. మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళన కారుల్ని అదుపుచేసే యత్నంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తలకు గాయాలయ్యాయి. పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. వరుణుడి కరుణకోసం యాగం

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి సస్యశ్యామలం కావాలన్న ఆకాంక్షతో విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణయాగం ప్రారంభమైంది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఈవో కోటేశ్వరమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరుణయాగం ఇవాళ్టి నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు వైదిక కమిటీ సభ్యుడు శివప్రసాదశర్మ తెలిపారు. దుర్గా ఘాట్‌లో 22 వరకు ఉదయం 6నుంచి 8గంటల మధ్య దేవస్థానం వేద విద్యార్థులు, రుత్వికులు వరుణజపం, వరుణానుపాక, శతానువాక, విరాటపర్వ పారాయణ చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ‘బిగ్‌బాస్‌ 3’ ప్రసారానికి స్టే కోరుతూ పిటిషన్‌

నటుడు కమల్‌హాసన్‌ నిర్వహించనున్న బిగ్‌బాస్‌-3 కార్యక్రమ ప్రసారానికి స్టే విధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బిగ్‌బాస్‌-3 కార్యక్రమం విజయ్‌ టీవీ ఛానెల్‌లో 23వ తేదీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టులో న్యాయవాది సుదన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బిగ్‌బాస్‌ కార్యక్రమంలో పాల్గొనే పోటీదారులు అశ్లీలంగా దుస్తులు ధరిస్తున్నారని, ద్వంద్వార్థాలతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇది యువతకు పరిపాటియైనా తల్లిదండ్రులకు సంకోచం కలిగిస్తోందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. కొరియాలో అడుగుపెట్టిన జిన్‌పింగ్‌

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ దంపతులు ఉత్తర కొరియాకు చేరుకున్నారు. ఆ దేశ సుప్రీంలీడర్‌ కిమ్ జోంగ్‌ ఉన్‌తో సమావేశం కోసం అక్కడకు వెళ్లాడు. రెండు రోజుల పాటు జిన్‌పింగ్‌ ఉత్తర కొరియాలో పర్యటిస్తారు. ఇందుకోసం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ప్రధాన ఆర్థిక సలహాదారు హీ లైఫెంగ్‌తో సహా ప్రధాన సహాయకులు ప్రత్యేక విమానంలో ప్యాంగ్యాంగ్‌ చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. అంచనాలను అందుకోని పాకిస్థాన్‌ ప్రదర్శన

ప్రపంచకప్‌లో తమ జట్టు ఆటతీరు ఏమాత్రం బాగోలేదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు పేర్కొంది. త్వరలోనే సర్ఫరాజ్‌ కెప్టెన్సీలోని పాక్‌ జట్టుపై గత మూడేళ్ల ప్రదర్శన ఆధారంగా పూర్తిస్థాయి సమీక్ష ఉంటుందని బుధవారం తెలిపింది. బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ (బీఓజీ) మీటింగ్‌లో ఆ జట్టు తాజా పరిస్థితిపై సమీక్షించిన అధికారులుపై విధంగా పేర్కొన్నారు. కాగా, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్న పాక్‌ సెమీస్‌ చేరే అవకాశాలపై ఇంకా ఆశలు పెట్టుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

ఉదయం నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్‌మార్కెట్లు ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 226, నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 69.58గా ఉంది. 

మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

మాజీ మంత్రి కన్నుమూత [09:48]

తెదేపా మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. గుండెపోటు రావడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా...

వేషం అడగడానికి వెళ్తే.. ‘గెట్‌ అవుట్‌’ అన్నారు! [09:40]

కొన్ని తారలు తళుక్కున మెరుస్తాయి. ఈయన మాత్రం సినీ వినీలాకాశంలో తళతళా మెరుస్తూనే ఉంటారు. సముద్రమంత అనుభవం..

పెళ్లికి నిరాకరించినందుకు వేధింపులు [09:34]

పరిచయాన్ని ఆసరాగా తీసుకొని ఓ మహిళను పెళ్లి చేసుకోమని వేధించాడు.. ఆమె నిరాకరించేసరికి తీరని వేదన కలిగించాడు....

‘ఏ చట్టం ప్రకారం చిదంబరానికి నోటీసులిచ్చారు’ [09:27]

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో కాంగ్రెస్ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని రెండు గంటల్లోగా దర్యాప్తు అధికారుల ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన..............

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]