పాక్‌ మీడియా వార్తను కొట్టిపారేసిన భారత్

న్యూదిల్లీ: శాంతి కోసం చర్చిద్దామని తాము ఇచ్చిన పిలుపునకు భారత్ ఎట్టకేలకు అంగీకరించిందంటూ పాకిస్థాన్ మీడియా పేర్కొన్న విషయంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. తాము ఇటువంటి ‌ప్రతిపాదన చేయలేదని స్పష్టతనిచ్చింది. ఈ విషయంపై గురువారం భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ... ‘‘పాక్‌ ప్రధాని, విదేశాంగ శాఖ ఇటీవల భారత ప్రధాని, విదేశాంగ మంత్రికి శుభాకాంక్షలు తెలపడంతో దానికి భారత్ ప్రతిస్పందించింది. దేశాల మధ్య నమ్మకం పెరగాలని, విరోధం, ఉగ్రవాదం, హింస తొలగిపోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే, ఉగ్రవాదం, హింస నీడలో ఉండని వాతావరణం నెలకొనాలని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. పాకిస్థాన్‌తో చర్చల కోసం ప్రతిపాదన చేయలేదు’’ అని స్పష్టం చేశారు.

కాగా, చర్చల కోసం తాము ఇచ్చిన పిలుపునకు భాతర ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ స్పందించారని, ప్రాంతాల శ్రేయస్సు కోసం తమ దేశంతో పాటు అన్ని దేశాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమని వారు అన్నారని పాకిస్థాన్‌ మీడియా పేర్కొంది. ఇటీవల కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌ వేదికగా షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ) ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌... ఆ సమావేశానికి వచ్చిన మోదీకి.. మరోసారి భారత ప్రధానిగా ఎన్నికైనందుకు గానూ శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం. అయితే, కిర్గిస్థాన్‌లో ఈ ఇరు నేతల మధ్య ప్రత్యేకంగా సమావేశం జరగలేదు. మరోవైపు, రెండు వారాల క్రితం పాక్‌ ప్రధాని, విదేశాంగ మంత్రి వేర్వేరుగా భారత్‌కు లేఖలు రాసి తమతో చర్చలు జరపాలని కోరారు.  

మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....