‘జబర్దస్త్‌’ లేకపోతే ఆది పరిస్థితి ఏంటి?

ఇంటర్నెట్‌డెస్క్‌: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోన్న కామెడీ షో ‘జబర్దస్త్‌’. అంతేకాదు, ఎంతోమంది కమెడియన్లను సైతం తెలుగు చిత్ర పరిశ్రమకు అందించింది. ఇక తనదైన పంచ్‌లు టైమింగ్‌తో జబర్దస్త్‌ షోలో నవ్వులు పంచే నటుడు ఆది. ‘హైపర్‌ ఆది’గా ఎంతో క్రేజ్‌ తెచ్చుకున్నాడు. మరి ప్రేక్షకులను కితకితలు పెడుతున్న ఆది ‘జబర్దస్త్‌’ షోకు రాకుండా ఉంటే ఏం చేసేవాడు. ఇదే ప్రశ్నను ఆయనను అడిగితే ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు.

‘‘కేవలం ‘జబర్దస్త్‌’ మాత్రమే అనుకొని ఇక్కడకు రాలేదు. అసలు ఇందులోకి వద్దామని కూడా అనుకోలేదు. ఒకేచోట కూర్చొని చేసే జాబ్‌ బోర్‌ కొట్టేసింది. పక్కన వాళ్లను నవ్వించడం అంటే నాకు బాగా ఇష్టం. అలా చేయడానికి నాకు కనిపించిన దారి ‘జబర్దస్త్‌’. అంతేకానీ, ముందు నుంచీ ఇందులోకి వెళ్దామని మాత్రం రాలేదు. అలా అనుకున్నప్పుడు ‘అత్తారింటికి దారేది’ క్లైమాక్స్‌ను స్ఫూఫ్‌ వీడియో చేశాం. అది యూట్యూబ్‌లో పెడితే వేలమంది చూశారు. ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తే ‘అదిరే అభి’ అన్న చూసి ‘బాగా చేశావ్‌ బ్రదర్‌. ఒకసారి కనిపించు’ అన్నాడు. అలా ‘జబర్దస్త్‌’లోకి ఎంటరయ్యా. వెళ్లిన వెంటనే ‘జబర్దస్త్‌’ టీమ్‌ సభ్యులతో కలిసి ఫొటోలు దిగి ఫేస్‌బుక్‌లో పెట్టేశా. అప్పటివరకూ రెండుమూడు లైక్‌లు వచ్చే నాకు వందల్లో వచ్చాయి. ఫొటోలు పెడితేనే ఇలా ఉందంటే.. మనం వాళ్లతో పాటు పక్కన ఉంటే ఇంకా ఎలా ఉంటుందోనని వెళ్లా.’’ అంటూ తాను ‘జబర్దస్త్‌’లోకి వచ్చిన నేపథ్యాన్ని పంచుకున్నారు.

మరిన్ని

సైబర్‌ కామాంధుడు [08:05]

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారి తప్పాడు.. ఉద్యోగాలిప్పిస్తానంటూ మభ్యపెట్టి వాట్సాప్‌ ద్వారా మహిళల నగ్నచిత్రాలను సేకరించాడు. 16 రాష్ట్రాల్లోని సుమారు 2 వేల మందితో చెలగాటమాడాడు....

20 ఏళ్లకు వెలుగులోకి బాలుడి అపహరణ [07:58]

ఓ చోరీ కేసులో నిందితురాలిని విచారిస్తే రెండు దశాబ్దాల కిందట ఓ బాలుడిని అపహరించిన ఉదంతం బయటపడిన సంఘటన ఇది...

ఒకే కుటుంబంలో ముగ్గురిని కాటేసిన పాము [10:15]

నిద్రిస్తున్న సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని పాము కాటేసింది. వీరిలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ...

నేలరాలిన భాజపా ‘అరుణ్‌’తార..! [12:50]

అమృత్‌సర్‌ నుంచి అరుణ్‌ జైట్లీ పోటీ చేస్తున్నారే విషయం తెలియగానే ఆ నియోజకవర్గంలో దాదాపు 40 భాజపా కార్యాలయాలు స్వచ్ఛందంగా తెరుచుకొన్నాయి..

రైలు కింద జారి పడి.. ప్రాణాలతో బయటపడి [12:41]

జార్ఖండ్‌ రాజధాని రాంచీ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ కదులుతున్న రైలు దిగే క్రమంలో రైలు కిందపడిన ఘటన చోటుచేసుకొంది.

అరుణ్‌జైట్లీ ఇకలేరు [12:35]

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ తుది శ్వాస విడిచారు. ...

పవన్‌ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు [12:30]

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంత రైతులు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లో కలిశారు...

రైతుగా కనిపించనున్న శర్వానంద్‌? [12:20]

ప్రముఖ నటుడు శర్వానంద్‌ నటించనున్న చిత్రం ‘శ్రీకారం’. కిశోర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్‌ రైతు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది...

శ్రీనగర్‌ బయలుదేరిన విపక్ష బృందం [12:10]

కశ్మీర్‌లో పర్యటించాలన్న విపక్షాల నిర్ణయం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కోరినా.. 

అరకు లోయలో అమానవీయం [11:58]

విశాఖ మన్యం అరకు లోయలో అమానవీయ ఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ యువతిపై అత్యాచారం ...