సైనికులారా జాగ్రత్త.. వల వేస్తున్నారు!

దిల్లీ: భారత ఆర్మీ అధికారులు సోమవారం సైనికులను అప్రమత్తం చేశారు. ఓ అనుమానిత మహిళా గూఢచారి.. భారత జవాన్లకు వల వేసే ప్రయత్నం చేస్తోందని హెచ్చరికలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఓయ్‌సోమ్యా’, ఫేస్‌బుక్‌లో ‘గుజ్జర్‌ సౌమ్య’గా చలామణి అవుతున్న వ్యక్తుల ఖాతాలు అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిపారు. వారి వివరాలపై ఆరా తీయగా నకిలీవని తేలిందన్నారు. భారత సైనికులకు వల వేసి విలువైన సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు.

గుజ్జర్‌ సౌమ్య అనే వ్యక్తి అమర జవాన్‌ పవన్‌ కుమార్‌ సోదరిగా చెప్పుకుంటోందని వెల్లడించారు. ఐఐటీ బాంబేలో ప్రస్తుతం విద్యాభ్యాసం కొనసాగిస్తున్నట్లు పేర్కొంటుందన్నారు. శత్రుమూకలు నకిలీ ఖాతాల ద్వారా చొరబడి.. భారత రక్షణ విభాగానికి చెందిన విలువైన సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ మేరకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ మిలిటరీ ఇంటెలిజెన్స్‌ సోమవారం హెచ్చరికలు జారీ చేసింది. గతంలోనూ దుండగులు ఇలాంటి ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. జనవరిలో ఓ యువతి పేరిట పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ భారత జవాన్‌ నుంచి కొంత సమాచారం రాబట్టింది. దీన్ని వెంటనే పసిగట్టిన నిఘా వర్గాలు ఆ సైనికుణ్ని అరెస్టు చేశాయి. లోతైన విచారణ అనంతరం అతణ్ని ఇతర విభాగానికి బదిలీ చేశారు.

మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు! [21:31]

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు...

గచ్చిబౌలి స్టేడియంలో ‘వెంకీమామ’ సందడి [21:16]

అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ ఆదివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేశారు. ఇండియన్‌ సూపర్‌లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌ ఎఫ్‌సీ×ఎఫ్‌సీ...

శివమెత్తిన శివమ్‌ [21:02]

శివమ్‌ దూబే (54, 30 బంతుల్లో 3×4, 4×6) రాణించడంతో వెస్టిండీస్‌కు భారత్‌ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. భారత్‌కు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM [21:00]

మహిళలపై జరుగుతున్న దురాగతాలను అరికట్టడానికి కొత్త చట్టాలను తీసుకురావడమొక్కటే పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుకు రాజకీయ సంకల్పం, పాలనా నైపుణ్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇలాంటి...

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు [20:14]

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం  ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే...

మద్యాన్ని ఆదాయవనరుగా భావించం:ఏపీమంత్రి [20:06]

సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో