ఇతడు ఇప్పుడు సూపర్‌ డైరెక్టర్‌: వర్మ

‘శివ’ వీడియో షేర్‌ చేస్తూ..

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తన స్నేహితుడు, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు పాత రోజులు గుర్తు చేశారు. ‘శివ’ సినిమాలోని పాట క్లిప్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో పూరీ జూనియర్‌ ఆర్టిస్టుగా డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. ‘ఈ వీడియోలో నీలిరంగు చొక్కాలో ఉన్న జూనియర్‌ ఆర్టిస్టు ఈ రోజు సూపర్‌ దర్శకుడిగా రాణిస్తున్న పూరీ జగన్నాథ్‌. హే పూరీ.. ఎంత గొప్ప సినీ ప్రయాణం’ అని ప్రశంసిస్తూ పోస్ట్‌ చేశారు. దీన్ని చూసిన పూరీ ప్రతిస్పందించారు. ‘అవును సర్‌..’ అంటూ నవ్వుతున్న ఎమోజీని షేర్‌ చేశారు. ‘నైపుణ్యం, ప్రతిభ ఉంటే ఎవరైనా సరే ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు అనడానికి నువ్వు ఓ ఉదాహరణ, అందరికీ స్ఫూర్తిదాయకం’ అని వర్మ తిరిగి బదులిచ్చారు.

వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ఆయన తన తర్వాతి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పూరీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. రామ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. జులై 18న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....