45 ఏళ్ల కరిష్మా.. ఇలా ఉన్నారు!

ముంబయి: ఒకప్పుడు తన అందచందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ తన ఇద్దరు పిల్లల బాధ్యతను మోస్తున్నారు. అయితే ఇటీవల కరిష్మా తన 45వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం లండన్‌ వెళ్లారు. అక్కడి సముద్రతీరంలో బికినీ వేసుకుని దిగిన ఫొటోను కరిష్మా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ఎంత వయసు వచ్చినా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. 

ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఎన్నో కామెంట్లు వచ్చాయి. ఆమె 45 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా, అందంగా ఉన్నారంటూ కొందరు, ఈ వయసులో ఇలాంటి దుస్తులేంటి? అంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు. ఫొటో పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే లక్షకు పైగా లైకులు వచ్చాయి. కత్రినా కైఫ్‌, అమృతా అరోరా, ఆథియా శెట్టి, కియారా అడ్వాణీ వంటి నటీమణులు కూడా కరిష్మా అందానికి ఫిదా అయ్యారు. కరిష్మా ఫొటోలు మాత్రం సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. 2018లో వచ్చిన ‘జీరో’ చిత్రంలో కరిష్మా అతిథి పాత్రలో కనిపించారు. సినిమాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తనదేనని ఒకానొక సందర్భంలో  వెల్లడించారు.

మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు [20:14]

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం  ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే...

మద్యాన్ని ఆదాయవనరుగా భావించం:ఏపీమంత్రి [20:06]

సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో

బాలయ్య సరసన రష్మి [19:54]

మాస్‌లో నందమూరి బాలకృష్ణకు ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్‌’. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు నటుడిగా ...

బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ [19:41]

ఉమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ హీట్‌ ఉమెన్‌ జట్టు నిలిచింది. వరుసగా రెండు సీజన్లో టైటిల్‌ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఉమెన్‌ జట్టుపై బ్రిస్బేన్‌ హీట్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం

చట్టాల సవరణలకు సంకల్పించాం: అమిత్‌షా [19:29]

హత్యాచారం వంటి తీవ్ర నేరాల్లో న్యాయం ఆలస్యం అవుతుండడంతో ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను సవరించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు.

కరణ్‌ డైరెక్షన్‌లో ఆ జోనర్‌లో నటించాలని ఉంది [19:16]

ఈ ఏడాది విడుదలైన ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి కియారా ఆడ్వాణీ. ప్రస్తుతం ఆమె కరణ్‌ జోహార్‌ నిర్మాతగా...