ట్రంప్‌పై ఓ కన్నేసి పెట్టండి!

 వోల్‌ఫెఫె సూచీ తయారు చేసిన జేపీమోర్గాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్ర్యతేకం: ట్రంప్‌కు ట్విటర్‌కు ఉన్న సంబంధం ప్రపంచానికి కొత్తగా తెలియనిదికాదు.. అమెరికా అధ్యక్షుడిగా ఆయన తీసుకునే నిర్ణయాలు మొత్తం ట్వీట్ల రూపంలోనే ప్రపంచానికి తెలుస్తాయి. అక్కడి పత్రికలపై ట్రంప్‌ కక్ష కట్టడంతో తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ట్విటర్‌ను వేదికగా ఎంచుకొన్నారు. ఆయన ట్వీట్‌ చేసిన ప్రతిసారీ స్టాక్‌, బాండ్‌ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఈ బాధను ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు తట్టుకోలేకపోతున్నాయి. దీంతో ఆయన ట్వీట్లపై ఓ కన్నేసి పెట్టడానికి అమెరికాకు చెందిన దిగ్గజ బ్యాంక్‌ జేపీ మోర్గాన్‌ చేస్‌ ఒక సూచీని తయారు చేసింది. ట్రంప్‌ ట్వీట్ల కారణంగా బాండ్ల వడ్డీరేట్లు ఎలా మారుతున్నాయో గుర్తిస్తుంది. దీనికి పెట్టిన పేరు ‘వోల్‌ఫెఫె ఇండెక్స్‌’.. 2017లో ట్రంప్‌ ఒక ట్వీట్‌లో ‘covfefe’ అని పొరబాటున ట్వీట్‌ చేశారు. అప్పట్లో ఇదేంటో అర్థంకాక అందరూ డిక్షనరీలను తిరగేశారు. చివరికి అది పొరబాటున టైప్‌ చేసిందని గుర్తించారు.. కానీ, అప్పటి నుంచి ఈ పదం బాగా పాపులరైంది. ఇలానే ఉండేలా వోల్‌ఫెఫె పేరు పెట్టారు. కాకపోతే ఇది ట్రంప్‌ కోసం పెట్టిందని జేపీ మోర్గాన్‌ బహిరంగా వెల్లడించే సాహసం చేయలేదు.   

ట్వీట్ల ప్రాధాన్యం

చైనాతో వాణిజ్య యుద్ధం జరుగుతుండటంతో కీలకమైన నిర్ణయాలను ట్రంప్‌ ట్విటర్‌లో వెల్లడిస్తున్నారు. ఇవి విదేశీమారక మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతున్నాయి. 2017 శ్వేత సౌధంలో అడుగుపెట్టినప్పటి నుంచి 10,000 సార్లకు పైగా ఆయన ట్వీట్లు చేశారు. రోజుకు సగటున 10సార్లు అయిన ట్విటర్‌లో ఉంటారు. 2016 ఎన్నిక సమయం నుంచి ఆయన ట్వీట్లు మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయని సిటీ గ్రూప్‌ పరిశీలనలో తేలింది.  ఇటీవల కాలంలో డాలర్లు, ఫెడ్‌ను ఉద్దేశించి ఆయన చేసే ట్వీట్లు పెరిగిపోయాయి. వాటి ప్రభావం మార్కెట్లపై పడుతోంది. 

మరిన్ని

5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం కష్టమే కానీ.. [00:23]

2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలని పెట్టుకున్న లక్ష్యం కష్టమే అయినప్పటికీ అసాధ్యమైనది మాత్రం కాదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడ్డారు.

భారత్‌లోని జీఎం ప్లాంట్‌ గ్రేట్‌వాల్‌ మోటార్స్‌ చేతికి..? [15:22]

భారత్‌లో విక్రయాలను నిలిపివేసిన అమెరికా కార్ల తయారీ సంస్థ జీఎం మోటార్స్‌ ఇండియా ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు చైనాకు చెందిన గ్రేట్‌వాల్‌ మోటార్స్‌ అంగీకరించింది.

జీవిత బీమాతో ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌ [17:46]

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ జీవిత బీమాతో కూడిన మరో ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను తీసుకొచ్చింది. రూ.2లక్షల జీవిత బీమాతో కూడిన రూ.179 ప్రీపెయిడ్‌...

తదుపరి బోర్డు సమావేశంలో డివిడెండ్‌పై నిర్ణయం! [22:20]

రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) కేంద్రానికి ఇవ్వాల్సిన మధ్యంతర డివిడెండు అంశంపై తదుపరి సెంట్రల్‌ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు మీడియా వర్గాల నుంచి సమాచారం.

#whatsapp సేవలకు అంతరాయం [18:51]

ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో అంతరాయమేర్పడింది. ఫొటోలు, వీడియోలు, జిఫ్‌ ఇమేజులు పంపించడం వీలు కాకపోవడంతో యూజర్లు అవస్థలు...

రిలయన్స్‌ పెట్రోల్‌ పంపుల్లో విక్రయాల జోరు [16:41]

దేశీయ చమురు రంగ దిగ్గజం రిలయన్స్‌ చమురు రిటైల్‌ మార్కెట్లో కూడా తన హవా కొనసాగిస్తోంది. రిలయన్స్‌కు చెందిన దాదాపు 1,400 పెట్రోల్‌...

ఎన్నెన్నో ప్రకటనలు.. కొన్నే అమలు..! [15:53]

ప్రభుత్వాలు బడ్జెట్లలో ఎన్నో ప్రకటనలను ఆర్థికమంత్రి చేస్తుంటారు. కానీ, వాస్తవంగా వీటిల్లో కొన్నే అమలవుతాయి. ప్రతి ప్రభుత్వంలో ఇవి సర్వసాధారణం...

‘బడ్జెట్‌’మే సవాల్‌..! [11:56]

భారత్‌ ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది..2020 బడ్జెట్‌.. సమస్యలతో టీ20 మ్యాచ్‌లానే ఉండనుంది. ఏమాత్రం తేడా వచ్చినా.. కోలుకొనే లోపే ఫలితం తలకిందులయ్యే అవకాశాలే చాలా ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఒక విష వలయంలో చిక్కుకొందనే చెప్పాలి. ఒకదానికి మరొకటి కారణమవుతూ వృద్ధి రేటును వెనక్కు గుంజుతున్నాయి.

మహీంద్రా వేగం పెంచిన ‘స్కార్పియోమ్యాన్‌’ [11:27]

బడా కార్పొరేట్‌ కంపెనీల్లో వారసులే ఛైర్మన్లుగా వ్యవహరిస్తుంటారు. లేదా సంస్థలో అత్యధిక వాటా కలిగిన వారిలో ఎవరో ఒకరు పగ్గాలు చేపడుతుంటారు. కానీ, భారత వాహనరంగ చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహీంద్రా మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. కంపెనీలో ఒక ఉద్యోగిగా చేరి..

మహీంద్రా చేతికి ఫిఫ్త్‌ గేర్‌ వెంచర్స్‌..! [00:24]

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎంఅండ్ఎం) ఈ-కామర్స్‌ సంస్థ ఫిఫ్త్‌ గేర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(ఎఫ్‌జీవీఎల్‌)ను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ కుదిరినట్లు...........