ఆ వీడియో స్టార్‌ కథానాయికను చేసింది

శ్రియ స్పా.. అక్కడ వాళ్లే ఉద్యోగులు

నటి జీవితం.. మీకు తెలియని విషయాలు!

‘నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా..’ అంటూ అందరి చేత కన్నీరు పెట్టించిందా భామ. అంతలోనే ‘నా మనసుకేమైంది..’ అంటూ తన ప్రేమలో పడేసుకుంది. ‘గుండు సూది గుండు సూది..’ అంటూ కుర్రకారు మనసుల్లోకి చొరబడింది. ‘చిన్ని చిన్ని ఆశలు రేగెనే..’ అంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆమే ‘దేవకి సమాజ సేవకి’ అంటూ సందడి చేసిన ముద్దుగుమ్మ శ్రియ. బుధవారం 37వ పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా శ్రియ గురించి కొన్ని ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేద్దాం..

అమ్మే గురువు

రిద్వార్‌లో జన్మించిన శ్రియ అక్కడి పాఠశాలలోనే చదివారు. తల్లి నీరజా కెమిస్ట్రీ ఉపాధ్యాయురాలు, తండ్రి పుష్పేంద్ర ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసేవారు. నీరజా చిన్నప్పటి నుంచే శ్రియకు కథక్‌, రాజస్థానీ జానపద నృత్యం నేర్పించారు. ఆ తర్వాత శ్రియ ప్రముఖ కథక్‌ నృత్యకారిణి శోవన్‌ నారాయణ్‌ దగ్గర శిక్షణ తీసుకున్నారు. చదివే రోజుల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలా బాల్యం నుంచే శ్రియకు కళల పట్ల ఆసక్తి ఉండేది.

వీడియో తెచ్చిన అవకాశం

ళాశాలలో చదువుతున్నప్పుడే డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రోత్సాహంతో ఓ మ్యూజిక్‌ వీడియోలో కనిపించే అవకాశం శ్రియకు లభించింది. ఆ వీడియోనే ఆమెకి సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ‘ఇష్టం’తో తెరకు పరిచయమయ్యారీ భామ. తొలి చిత్రంతోనే తన అందంతో కుర్రకారు మనసులు దోచుకున్నారు. దీంతో వెంటనే అవకాశాలు వరుస కట్టాయి. నాగార్జునతో ‘సంతోషం’లో నటించి మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి ఆమె జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. తెలుగుతో పాటు, దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి పేరు తెచ్చుకున్నారు. 2003లో ‘తుఝే మేరీ కసమ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

అగ్ర నాయకులతో..

చిత్ర పరిశ్రమలోని దాదాపు అందరు అగ్ర కథానాయకులతో కలిసి నటించే అవకాశం కొంతమంది నటీమణులకే వస్తుంది. ఈ జాబితాలో శ్రియ నిలిచారు. చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్‌, నాగార్జున, మహేశ్‌బాబు, వెంకటేశ్‌ తదితరులకు జోడీగా సందడి చేశారు.

వన్నె తరగని అందం

శ్రియ కెరీర్‌ ప్రారంభించి 20 ఏళ్లు కావొస్తోంది. అయినప్పటికీ ఇంకా అదే అందంతో నేటి కథానాయికలకు పోటీగా నిలుస్తున్నారు. వయసు మీదపడినా... వన్నె తరగని అందాల భామల జాబితాని తయారు చేస్తే అందులో శ్రియ మొదటి వరుసలో ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు.

అతడితో ప్రేమ, పెళ్లి 

శ్రియ తన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశ్చీవ్‌నితో ఆమె ప్రేమలో ఉన్నారని చాలా రోజులు ప్రచారం జరిగింది. అయితే దానిపై శ్రియ కామెంట్‌ చేయలేదు. ఆపై 12 మార్చి 2018లో బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీని వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా సినిమా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తమిళంలో ‘నరగాసూరన్‌’, ‘సండక్కరి’.. హిందీలో ‘తడ్కా’ చిత్రాల్లో చేస్తున్నారు.

వైరల్‌ అయిపోతున్నాయ్‌

మధ్య శ్రియ నెట్టింట్లో డ్యాన్స్‌ వీడియోలను తెగ షేర్‌ చేస్తున్నారు. పొట్టి దుస్తుల్లో ఆమె వయ్యారంగా వేస్తున్న స్టెప్పులకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. దీంతో ఆ వీడియోలు కాస్త వైరల్‌గా మారుతున్నాయి.

సమాజం కోసం..

శ్రియ సమాజ సేవలోనూ ముందుంటారు. వీలు దొరికినప్పుడల్లా పేద, అనాథ చిన్నారులతో కలిసి సమయం గడుపుతుంటారు. వారికి ఆర్థిక సాయం కూడా చేస్తుంటారు. ‘సెలబ్రిటీలు అవసరాల్లో ఉన్న వారికి అండగా ఉండాలి, అలాంటి కార్యక్రమాలను ప్రమోట్‌ చేయాలి. విరాళాలు సేకరించేందుకు ముందుకు రావాలి’ అని చెబుతుంటారు. శ్రియ కుటుంబం కూడా ఆమెను ఈ విషయంలో ప్రోత్సహిస్తూనే ఉంటుంది.

అక్కడ వాళ్లే ఉద్యోగులు

2011లో ముంబయిలో శ్రియ shree స్పాను ప్రారంభించారు. అందులో ఉద్యోగులుగా దివ్యాంగుల్ని తీసుకున్నారు. ‘దిల్లీలో చదువుకునే రోజుల్లో మా పాఠశాల పక్కన చూపులేని వారి కోసం పాఠశాల ఉండేది. ప్రతివారం అక్కడికి వెళ్లి వచ్చేదాన్ని. అక్కడి వారు సామాన్య వ్యక్తుల్లానే క్రికెట్‌ ఆడటం చూసేదాన్ని. వాళ్లు అన్నీ పనులు స్వతహాగా చేసుకునేవారు. వారి కోసం ఏదో ఒకటి చేయాలని అప్పుడు అనుకున్నా’ అని శ్రియ ఓ సందర్భంలో shree స్పా ప్రారంభించడం వెనుక ఉద్దేశాన్ని చెప్పారు.

తేడాలు లేవు

‘నాకు కోలీవుడ్‌, బాలీవుడ్‌.. అనే తేడాలు లేవు. నేను సినిమాల్ని భాష ఆధారంగా వేరు చేసి చూడను. నా వరకు కేవలం ఒకే కేటగిరీ ఉంది.. అదే  ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ. 2013 జనవరిలో శ్రియ ట్విటర్‌ ఖాతాకు దూరమయ్యారు. ఫాలోవర్స్‌ నుంచి విమర్శలు వస్తుండటంతో వైదొలగారు. తిరిగి 2015 జనవరి 27న కొత్త ట్విటర్‌ ఖాతాను ప్రారంభించి అభిమానులకు చేరువగా ఉంటున్నారు. 

-ఇంటర్నెట్‌డెస్క్‌
 మరిన్ని

తెదేపా నేతల గృహనిర్బంధం [01:05]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలపై ఆంక్షలు [00:55]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [01:04]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

దీపికపై అభిమానుల ఫైర్‌ [01:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [01:05]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్యను హేయమైందిగా చంద్రబాబు పేర్కొన్నారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు

మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకున్నారు:రేవంత్‌ [01:04]

దిల్లీ నుంచి తాను నిధులు తీసుకొస్తానని.. వాటిని సక్రమంగా ఖర్చు పెట్టాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. కాలనీలను అభివృద్ధి చేయాలంటే...

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

రాజధాని కోసం ఆగిన మరో గుండె [00:55]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

ఆ రైల్వే స్టేషన్లలో సంస్కృతం [00:54]

ఉత్తరాఖండ్‌ రైల్వేస్టేషన్లలోని నామ ఫలకాలపై ఉర్దూ స్థానంలో ఇకపై సంస్కృతం వచ్చి చేరనుంది. రైల్వే ప్లాట్‌ఫాంపై ఉండే నామ ఫలకాలు ఆ రాష్ట్రానికి చెందిన ద్వితీయ భాష....