నా ప్రియుడు నటుడు, క్రికెటర్‌ కాదు: తాప్సి

పిల్లలు కావాలి అనిపిస్తే పెళ్లి చేసుకుంటా

ముంబయి: ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని కథానాయిక తాప్సి వెల్లడించారు. ఆమె డేటింగ్‌లో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఛాట్‌ షోలో ఆమె ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడారు. పిల్లలు కావాలి అనిపించినప్పుడు వివాహం చేసుకుంటానని పేర్కొన్నారు. ‘గాసిప్స్‌ కోసం కాకుండా నా వ్యక్తిగత జీవితం గురించి నిజాయితీగా తెలుసుకోవాలి అనుకుంటున్న వారి కోసం చెబుతున్నా.. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నా జీవితంలో ఉన్న వ్యక్తి అందరూ అనుకుంటున్నట్లు నటుడు, క్రికెటర్‌ కాదు. కనీసం అతడు మన చుట్టు పక్కల ప్రాంతంలో కూడా లేడు. నాకు పిల్లలు కావాలి అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పారు. అనంతరం తాప్సి సోదరి షగున్‌ మాట్లాడుతూ.. ‘ఈ విషయంలో తాప్సి నాకు థాంక్స్‌ చెప్పాలి. ఎందుకంటే నా వల్లే తనకు ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడింది’ అని చెప్పారు.

తాప్సి ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో నటిగా కెరీర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. అక్కడ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ‘మిషన్‌మంగళ్‌’తో హిట్‌ అందుకున్న ఆమె ప్రస్తుతం ‘తడ్కా’, ‘షాంద్‌కీ ఆంఖ్‌’లో నటిస్తున్నారు. మరోపక్క తమిళ స్టార్‌ జయంరవి నటిస్తున్న సినిమాకు ఇటీవల సంతకం చేశారు.

మరిన్ని

దీపికపై అభిమానుల ఫైర్‌ [01:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

సరికొత్త లుక్‌లో బాలకృష్ణ.. ఎందుకోసం..? [00:54]

పాత్ర అంటే ప్రాణం పెట్టే నటుల్లో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల...