నలుపు తగ్గించే మార్గాలివి...

వేళకు నిద్రపోకపోతే చాలు కొందరికి కళ్ల కింద నల్లటి చారలు వచ్చేస్తాయి. వీటిని ఇంటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చో చూడండి.
* బాదం నూనె: ఈ నూనెలో విటమిన్‌ కె ఎక్కువగా ఉంటుంది. కళ్లకింద చర్మం రంగు మారకుండా చేస్తుంది.  నల్లటి వలయాలను క్రమంగా మాయం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. నిద్రపోయే ముందు ఈ నూనెను కళ్ల చుట్టూ రాసుకుని మర్దన చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఫలితం ఉంటుంది.  
* బంగాళాదుంప: బంగాళాదుంపలో బ్లీచింగ్‌ గుణాలుంటాయి. ఇది కళ్ల వాపు, వాటి చుట్టూ ఉండే చర్మం రంగు మారకుండా చేస్తుంది. దీన్ని రసం తీసుకుని కళ్ల అడుగున రాసి పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ఫలితం ఉంటుంది.
* టొమాటో: నల్లటి వలయాల్ని తగ్గించే గుణం టొమాటోలకు ఉంది. సమాన పరిమాణంలో నిమ్మరసం, టొమాటో గుజ్జుని తీసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తరచూ రాసుకుంటే నలుపుదనం తగ్గుతుంది.
* గ్రీన్‌టీ : వాడేసిన గ్రీన్‌టీ బ్యాగులను గోరువెచ్చని నీళ్లలో ముంచి తీసి కళ్లపై ఉంచుకోవాలి. ఇది అలసటని, వాపుని తగ్గిస్తుంది. మచ్చల్ని దూరం చేస్తుంది.

మరిన్ని

భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు [00:05]

భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....