పెళ్లి చేసుకుంటున్నారా?

పెళ్లికి ముందు వరకూ ఒకరినొకరు ఆకర్షించడానికీ, మెప్పించడానికీ రకరకాల ప్రయత్నాలు చేస్తారు. తీరా పెళ్లయ్యాక ఎదుటివారిలో లోపాలు వెతుకుతారు. ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే... పెళ్లికి ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా...
గౌరవించండి.... ఇప్పటివరకూ పెరిగిన వాతావరణానికి భిన్నమైన ప్రదేశంలోకి అడుగుపెట్టబోతున్నారనేది గుర్తుంచుకోవాలి. కొన్ని సమస్యల్ని తగ్గించాలంటే ముందే వారి ఆచార, వ్యవహారాలను తెలుసుకుని ఆచరించేలా చూసుకోండి. అలాకాకుండా మా పుట్టింట్లో ఇలా... మేమైతే అలా చేస్తామంటూ వాదించడం వల్ల తెలియకుండానే మీలో ప్రతికూల భావనలు పెరుగుతాయని మరవకండి.  
సర్దుబాట్లు ముందే... కాబోయే శ్రీవారికోసం అప్పటికప్పుడు మీ అలవాట్లను మార్చుకునే ప్రయత్నం చేయొద్దు. ముఖ్యంగా మీ మనసుకి నచ్చని పని అసలు చేయకండి. అలా చేసుకుంటూ పోతే తీవ్ర అసంతృప్తిలో కూరుకుపోతారు. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోండి. ఎదుటివారు ఎక్కడ సర్దుకోలేరో వాటిని మీరు ఎంతమేరకు అంగీకరించగలరో ఆలోచించుకోండి. అనవసర వాదనలకు తావుండదు.
వాస్తవికంగా ఉండేలా: మీరు ఎలా ఉంటారో... అదే విషయాన్ని ఎదుటివారికి స్పష్టం చేయండి.  ఎదుటివారూ అలాగే ఉంటారు కాబట్టి... లోపాలు వెతికే ప్రయత్నం చేయకండి. చాలా సమస్యలు తీరతాయి.

మరిన్ని

విశాఖలో ‘అల..’ విజయోత్సవ సభ [00:36]

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా విడుదలై రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సందర్భంగా...

భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు [00:05]

భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....