కాబోయే అమ్మకు పోషకాల ఫలహారం!

కాబోయే అమ్మ కల... పండంటి బిడ్డని ఎత్తుకోవడమే. పాపాయి ఆరోగ్యంగా, అందంగా పుట్టడానికి చేయాల్సినవన్నీ చేస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నో సందేహాలు ఎదురవుతాయి. వీటికి తోడు ఇవి తినాలి... అవి తినకూడదు! అంటూ కొందరు చెప్పే మాటలు... గర్భిణిని మరింత భయపెడతాయి. అవసరమైనవి తినక... సరైన పోషకాలు అందక నానా అవస్థలు పడుతుంటారు. అసలు ఈ తొమ్మిదినెలల్లో ఏం తినకూడదు... ఏం తినాలో వివరిస్తున్నారు పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ లతాశశి.
గమనిక:  గర్భిణులు స్థానికంగా, కాలానుగుణంగా  దొరికే అన్ని పండ్లు తినొచ్చు. గర్భం దాల్చకముందు  ఏదైనా పండు, కూరగాయలు, ఆకుకూరలు, ఇతర పదార్థాలేవైనా తిన్నప్పుడు అలర్జీ  వచ్చి ఉంటే గర్భం ధరించినప్పుడు వాటికి దూరంగా ఉండాలి. పండ్ల రసం తీసుకోవడం కన్నా... నేరుగా పండ్లు తినడమే మంచిది. మధుమేహం, జస్టేషనల్‌ ప్రెగ్నెన్సీ ఉన్నవారు మాత్రం మామిడి, సపోటా, సీతాఫలం, ద్రాక్ష, అరటిపండ్లకు దూరంగా ఉండాలి.
త ల్లి కాబోయే ప్రతి మహిళా పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా తినాల్సినవి పండ్లు. స్థానికంగా, కాలానుగుణంగా దొరికే ఏవైనా రెండు రకాల పండ్లను...ఒక్కోదాన్ని వందగ్రాముల చొప్పున రోజూ తీసుకోవాలి. వాటిలో ముదురు పసుపు, నారింజ వర్ణంలో ఉన్న పండ్లను తప్పనిసరిగా ఎంచుకోవాలి. వీటి నుంచి బీటాకెరొటిన్‌, విటమిన్‌-ఎ ఎక్కువగా అందుతాయి. కూరగాయల్లో...రోజూ ఒక కప్పు(వందగ్రాములు) ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. మిగతా మూడు కప్పులు వారికి ఇష్టమైనవి తినొచ్చు. ఎంత అయిష్టంగా అనిపించినా సరే! రోజులో అరలీటరు పాలు, సంబంధిత పదార్థాలైన పెరుగు, మజ్జిగ, పనీర్‌లను ఆహారంలో చేర్చుకోవాలి. మధుమేహం ఉన్నవారు సైతం ఈ సమయంలో చక్కెర లేకుండా పాలు తాగొచ్చు. మీగడ తీసిన పాలైతే మరీ మంచిది. ఇవన్నీ సరే... అసలు కాబోయే తల్లులకు ఎదురయ్యే అపోహలేంటో చూద్దామా...

అపోహలు... వాస్తవాలు
* నేరేడు పండ్లు తింటే పిల్లలు నల్లగా పుడతారా...?
కాదు. గర్భిణులు నిరభ్యంతరంగా వీటిని తీసుకోవచ్చు. వాటితో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాదు.
* అరటి పండు తినకూడదా?
ఇది మరొక పెద్ద అపోహ. దీన్ని తినడం చాలామంచిది. అరటిపండుతో ఎన్నో పోషకాలు లభిస్తాయి. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణి ఆరోగ్యపరంగా బరువు పెరగడం చాలా ముఖ్యం. తక్కువ బరువున్నవారిని ఈ పండును తీసుకోవాలని చెబుతారు వైద్యులు. రోజుకొకటి తిన్నా చాలు. శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎమ్‌ఐ) 23 నుంచి 24లోపు ఉన్నవారు గర్భం దాలిస్తే పది నుంచి పన్నెండు కిలోల బరువు పెరగాల్సి ఉంటుంది. బీఎమ్‌ఐ 18 కంటే తక్కువగా ఉన్నవారు పన్నెండున్నర నుంచి పద్దెనిమిది కిలోల బరువు పెరగాల్సి ఉంటుంది. తగినంత శక్తి అందాలంటే అరటిపండు తీసుకోవాలన్నది నిపుణుల సూచన. ఇది పోషకాలనూ అందిస్తుంది. బీఎమ్‌ఐ ఎక్కువగా ఉండి ఊబకాయం ఉన్న గర్భిణులు తినేటప్పుడు కాస్త పరిమితి పాటించడం మంచిది.
* జామపండు తింటే జలుబు చేస్తుంది. వాటి గింజలతోనూ సమస్యలు ఎదురవుతాయి...?
జామకాయలో విటమిన్‌ సి దండిగా ఉంటుంది. గర్భిణిగా ఉన్నప్పుడు ఇనుము అవసరం ఎక్కువ. దీన్ని శరీరం సరిగా గ్రహించాలంటే విటమిన్‌ సి తీసుకోవడం తప్పనిసరి. జామ నుంచి ఇది బాగా అందుతుంది.  
* నువ్వులు పుట్టబోయే పాపాయికి హానిచేస్తాయి?
ఇదో అపోహ మాత్రమే. నువ్వులు తింటే వేడి చేస్తుందని చాలామంది అభిప్రాయం. నిజానికి రక్తహీనత నివారణకు ఇవి బాగా ఉపయోగపడతాయి. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు వేడిచేసిందని చాలామంది భావిస్తుండొచ్చు. సరిపడా నీళ్లు తాగితే...ఇలాంటి పరిస్థితి ఎదురుకాదు. సాధారణ మహిళలతో పోలిస్తే గర్భిణులకు  రెట్టింపు నీరు అవసరం. ఏదైనా సందేహం ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
* పైనాపిల్‌ తినకూడదు...?
ఈ పండులోని ఎంజైమ్‌ల వల్ల గర్భస్రావం అవుతుందని అనుకుంటారు చాలామంది. వైద్యుల సలహాతో దీన్ని ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా జీర్ణ సమస్యలున్న గర్భిణులు దీన్ని తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.
* జీడిపప్పు, కిస్‌మిస్‌, బాదం లాంటి ఎండు ఫలాలను తీసుకోవచ్చా?
గర్భిణులు వీటన్నింటినీ తీసుకోవచ్చు. గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చినవారు (జస్టేషనల్‌ డయాబెటిస్‌) ఖర్జూరం, అంజీరా, కిస్‌మిస్‌ లాంటివి తీసుకోకపోవడమే మంచిది. బేకరీ, మైదా పదార్థాలకు దూరంగా ఉండాలి.  
* సాధారణ గర్భిణులు తీపి పదార్థాలు తినొచ్చా?
మధుమేహం లేనివారు మితంగా తింటే ఇబ్బందేమీ ఉండదు. వీరితోపాటు అధికరక్తపోటు ఉన్నవారు ఉప్పు, తీపి ఎక్కువగా ఉన్న పదార్థాలు వీలైనంతవరకూ తగ్గించుకోవాలి. ఆరోగ్యంగా ఉన్న గర్భిణులు రోజులో నాలుగు చెంచాల వరకూ చక్కెర తినొచ్చు.
కాలాన్ని బట్టి ఆహారం
గర్భధారణను మూడు భాగాలుగా విభజిస్తారు.
వాటిని బట్టి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.
మొదటి త్రైమాసికం:
అంటే మొదటి మూడు నెలలు. ఈ సమయంలో ఫోలిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ఆకుకూరలు, నువ్వులు, నారింజ, క్యారెట్‌, సెనగలు, బఠాణీలు వంటివి ఎంచుకోవాలి.
రెండో త్రైమాసికం: తరువాతి మూడు నెలల కాలం. ఈ సమయంలో ఫోలిక్‌ యాసిడ్‌తోపాటు ఐరన్‌, క్యాల్షియం, మాంసకృత్తులున్న పదార్థాలను తీసుకోవాలి. మాంసాహారులు మోతాదు ప్రకారం మితంగా తీసుకోవాల్సి ఉంటుంది. డ్రైఫ్రూట్స్‌, ఆకుకూరల నుంచి ఐరన్‌ లభిస్తుంది. పాలు, గుడ్డు, పప్పు ధాన్యాలు, సోయా ఉత్పత్తుల నుంచి మాంసకృత్తులు లభిస్తాయి.
మూడో త్రైమాసికం: చివరి మూడు నెలల కాలం. పై పదార్థాలన్నింటితోపాటు ఫ్యాటీయాసిడ్లు, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు అందేలా చూసుకోవాలి.

మరిన్ని

తెదేపా నేతల గృహనిర్బంధం [01:05]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలపై ఆంక్షలు [00:55]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [01:04]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

దీపికపై అభిమానుల ఫైర్‌ [01:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [01:05]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్యను హేయమైందిగా చంద్రబాబు పేర్కొన్నారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు

మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకున్నారు:రేవంత్‌ [01:04]

దిల్లీ నుంచి తాను నిధులు తీసుకొస్తానని.. వాటిని సక్రమంగా ఖర్చు పెట్టాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. కాలనీలను అభివృద్ధి చేయాలంటే...

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

రాజధాని కోసం ఆగిన మరో గుండె [00:55]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

ఆ రైల్వే స్టేషన్లలో సంస్కృతం [00:54]

ఉత్తరాఖండ్‌ రైల్వేస్టేషన్లలోని నామ ఫలకాలపై ఉర్దూ స్థానంలో ఇకపై సంస్కృతం వచ్చి చేరనుంది. రైల్వే ప్లాట్‌ఫాంపై ఉండే నామ ఫలకాలు ఆ రాష్ట్రానికి చెందిన ద్వితీయ భాష....