తాళమేస్తే ఊడ్చేస్తున్నారు...

అద్దంకిలో రెండిళ్లలో చోరీ

 

రామశాస్త్రివీధిలో ఇంటిని పరిశీలిస్తున్న ఎస్‌ఐ

 

అద్దంకి, న్యూస్‌టుడే: తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరులు రెచ్చిపోతున్నారు. ఇంటికి తాళమేసి ఊళ్లకు వెళ్తే చాలు.. వచ్చేసరికి ఊడ్చేస్తున్నారు. అద్దంకి కమఠేశ్వరమాన్యంలోని రెండు ఇళ్లలో సోమవారం రాత్రి ఈ తరహా ఉదంతాలే చోటుచేసుకున్నాయి. ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు తెలిపిన సమాచారం మేరకు.. కమఠేశ్వరమాన్యంలో షేక్‌ రఫీ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం మహానంది వెళ్లారు. తిరిగి మంగళవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. తూర్పువైపున్న కిటికీ పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. పడక గదిలోని పరుపు కింద ఉంచిన రూ.9 వేల నగదు, పక్కనే డబ్బాలో ఉంచిన ఎనిమిది గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు.

* రామశాస్త్రి వీధి చివరిలో నివసముంటున్న విశ్రాంత బ్యాంక్‌ ఉద్యోగి రావూరి రంగయ్య ఇంట్లోనూ గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి ప్రయత్నించారు. రంగయ్య కుటుంబ సభ్యులు ఇంకొల్లు మండలం సూదివారిపాలెంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం వచ్చి చూడగా ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి పరిశీలించగా.. బీరువా తలుపులు పగులగొట్టి వస్తువులు చిందర వందరగా పడేసి ఉండటాన్ని చూశారు. నగదు, బంగారు ఆభరణలు అందుబాటులో లేకపోవటంతో ఎలాంటి నష్టం లేకపోయింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ తన సిబ్బందితో ఇల్లు, పరిసరాలను పరిశీలించారు. ఒంగోలు నుంచి నిపుణులను రప్పించి వేలిముద్రలు సేకరించారు.

ఇంట్లోని వస్తువుల్ని చిందరవందరగా పడేసిన దృశ్యం

మరిన్ని

చేబ్రోలు యువకుడి ‘జాబ్‌’పాట్‌.. ఒకేసారి 4 ఉద్యోగాలు [11:11]

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన రాయుడు త్రిమూర్తులు(27) అనే యువకుడు రాసిన ప్రతి పోటీ పరీక్షలోనూ ప్రతిభ కనబరిచి 5 నెలల కాలంలో 4 ఉద్యోగాలకు ...

ప్రధానోపాధ్యాయుడి దారుణ హత్య [12:51]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం తూరంగిలో వెంకట్రావు అనే ప్రధానోపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు...

ఒక్కో పరుగు తీసేందుకు కష్టపెడతారు [18:04]

ఇంగ్లాండ్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ జోడెన్లీ ఆసీస్‌ బౌలర్లను కొనియాడాడు. ఒక్కో పరుగు తీసేందుకు కంగారూలు చాలా కష్టపెడతారని చెప్పాడు. బ్యాట్స్‌మన్‌ ఓపెనింగ్‌ చేసే ప్రతీసారి బాగా ఆడి మంచి...

ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం నిజం కాదు: హరీశ్‌ [17:53]

కాంగ్రెస్‌, భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు అన్యాయం చేశాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎనిమిదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ పార్టీ పెట్టిన ఖర్చు రూ.107 కోట్లు కాగా.. తెరాస ప్రభుత్వం రూ.617 కోట్లు ఖర్చు పెట్టి,  

బోటులో వెళ్లిన పర్యాటకుల వివరాలివే! [17:43]

గోదావరిలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైనవారికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నదిలో గాలిస్తున్నాయి. రాయల్‌ వశిష్ఠ

హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్ధమయ్యారు! [17:31]

నందమూరి బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో సినిమా రాబోతోంది. వీరిద్దరూ ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలతో సక్సెఫుల్‌ కాంబినేషన్‌ అనిపించుకున్నారు. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకా సినిమా టైటిల్‌ ఖరారు చేయలేదని పేర్కొన్నారు. డిసెంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని తెలిపారు.

స్మిత్‌ అద్భుత క్యాచ్‌ చూశారా? [17:19]

శనివారం ఓవర్‌నైట్‌ స్కోర్‌ 9/0తో మూడోరోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్‌ మ్యాచ్‌పై పట్టుబిగించింది. జోడెన్లీ(94), బెన్‌స్టోక్స్‌(67), జోస్‌బట్లర్‌(47) రాణించడంతో భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది...

మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు [17:07]

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఘటనపై సీఎం జగన్‌ అధికారులతో

టాప్‌ 10 న్యూస్‌@ 5 PM [16:59]

తూర్పుగోదావరి జిల్లా కచులూరు మందం దగ్గర గోదావరిలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదం విషాదాంతమైంది. బోటులో పాపికొండల పర్యాటకానికి వెళ్లిన వారిలో ఇప్పటి వరకు 12 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 24 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు సమాచారం.

పీవీ అమ్మకాల్లో పడిన మారుతీ వాటా [16:57]

వాహనాల అమ్మకాల్లో మందగమనం నేపథ్యంలో దేశీయంగా ప్రయాణికుల వాహనాలను (పీవీ) తయారు చేసే మారుతీ సుజుకీ, టాటామోటార్స్‌ మార్కెట్‌ వాటాలు పడిపోయాయి. ఏప్రిల్‌-ఆగస్టు అమ్మకాల్లో ఆ