మహిళ అవయవ దానం

ఆదర్శమూర్తిగా నిలిచిన శాంతమ్మ

చౌడేపల్లె, న్యూస్‌టుడే : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం సమీపంలోని పాలమాకలపల్లెకు చెందిన శాంతమ్మ (51) మరణించి తన కళ్లు, ఊపిరితిత్తులు, గుండెను మంగళవారం ఇతరులకు అవయవ దానం చేసింది. చౌడేపల్లె ఎస్సీ బాలుర వసతిగృహంలో వంట సహాయకురాలిగా పనిచేస్తున్న ఆమె గత శనివారం తన కుమారుడు ఉమాపతితో కలిసి ద్విచక్రవాహనంపై తిరుమలకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో పాకాల వద్ద ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన ఆమెను వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించగా చికిత్సలు పొందుతూ మృతిచెందింది. ఆరోగ్యంగా ఉన్న ఆమె అవయవాలను ఇతరులకు దానం చేసి ఆదుకోవాలని అక్కడి వైద్యులు కోరడంతో ఆమె కుటుంబసభ్యులు అన్నపూర్ణ, ఈశ్వర్‌కుమార్‌, ఉపమాతి అంగీకరించడంతో ఈ మేరకు అవయవదానం జరిగింది.

మరిన్ని

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....