ప్రియుడితో కలిసి భర్త హత్య

ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ
23 రోజుల తర్వాత వెలుగులోకి
మృతుడి భార్య సహా మరో ఇద్దరి అరెస్టు

విశాఖపట్నం: సైన్యంలో హవల్దార్‌గా పనిచేస్తున్న తన భర్తను ప్రియుడితో కలిసి ఓ భార్య అంతమొందించింది. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించింది. అనంతరం సైనిక అధికారులను సంప్రదించి తన భర్తకు  రావాల్సిన నగదు మొత్తాలపై ఒత్తిడి తీసుకువచ్చింది. అనుమానం వచ్చిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు రంగంలో దిగి తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో 23 రోజుల తర్వాత అసలు విషయం బయటపడింది. సీపీ ఆర్‌కే మీనా మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం... మద్దిలపాలెంలో అత్త, భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్న దల్లి జ్యోతి(26) గతనెల 19న ఎంవీపీ కాలనీ పోలీసులకు ఫోన్‌ చేసింది. తన భర్త సతీష్‌కుమార్‌(32) ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. కుటుంబసభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయక పోవడంతో పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

మత్తు మందు ఇచ్చి... చున్నీతో మెడ బిగించి..
సతీష్‌ భార్య జ్యోతికి 9 నెలల క్రితం పాత జైలురోడ్డుకు చెందిన సిమ్మా భరత్‌కుమార్‌(24)తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. సెలవుపై వచ్చిన సతీష్‌కుమార్‌కు ఈ విషయం తెలియడంతో ఆయన భార్యను నిలదీశారు. భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన జ్యోతి...  ప్రియుడు భరత్‌కుమార్‌, కొత్తరేసపువానిపాలేనికి చెందిన గొడ్ల భాస్కర్‌రావు(22) సాయంతో పథకం రచించింది. గత నెల 18న సతీష్‌కుమార్‌ తాగుతున్న మద్యంలో జ్యోతి నిద్ర మాత్రలను కలిపి ఇవ్వడంతో అతను మత్తులోకి జారుకున్నాడు. అర్ధరాత్రి భరత్‌, భాస్కర్‌ ఇంట్లోకి చొరబడి మత్తులో ఉన్న సతీష్‌కుమార్‌ మెడకు చున్నీని బలంగా బిగించి హత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని చీరతో ఫ్యాన్‌కి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలిస్తున్నామని సీపీ ఆర్‌కే మీనా వివరించారు. పోస్టుమార్టం నివేదిక, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించిన నమూనాల ఫలితాలు అందాక విచారణను వేగవంతం చేశామని ఆయన చెప్పారు.

మరిన్ని

భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు [00:05]

భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....