కరకట్టపై రెండు కార్లు ఢీ

ఒకరికి తీవ్ర గాయాలు.. విజయవాడ తరలింపు

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే : మండలంలోని పాములలంక కృష్ణానది కరకట్ట రహదారిపై మంగళవారం సాయంత్రం రెండు కార్లు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం మోపిదేవి నుంచి విజయవాడ వెళ్తున్న కారును సతీష్‌కుమార్‌ నడుపుతున్నారు. విజయవాడ నుంచి మరో కారులో పలువురు మోపిదేవి ఆలయానికి వెళుతున్నారు. ఈ క్రమంలో పాములలంక కరకట్ట రహదారి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. సతీష్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో రెండు కార్లు దెబ్బతిన్నాయి. సంఘటనా స్థలాన్ని తోట్లవల్లూరు ఎస్‌ఐ చిట్టిబాబు సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు.

మరిన్ని

విశాఖలో ‘అల..’ విజయోత్సవ సభ [00:36]

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా విడుదలై రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సందర్భంగా...

భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు [00:05]

భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....