స్మిత్‌ గేలి చేసింది లీచ్‌ను కాదు..!

లండన్‌: బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు మరో సమస్య తలెత్తింది. యాషెస్‌ సిరీస్‌లోని నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్‌ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. విజయానంతరం ఆసీస్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ లీచ్‌ తరహాలో స్మిత్‌ కళ్లద్దాలు పెట్టుకోగా ఆసీస్ ఆటగాళ్లు అతడిని ఔట్‌ చేస్తున్నట్లుగా నటించారు. దీంతో లీచ్‌ను గేలి చేసినట్లు భావించిన ఇంగ్లాండ్‌ అభిమానులు స్మిత్‌పై పెద్దఎత్తున మండిపడ్డారు. మోసగాడు ఇలా వ్యవహరించడం ఆశ్చర్యమేమి కాదని కామెంట్లు చేస్తున్నారు. అయితే స్మిత్‌ అనుకరించింది ఆసీస్‌ ఆటగాడు క్రిస్ రోజర్స్‌ను అని లీచ్‌ను కాదని ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్ లాంగర్‌ తెలిపాడు. 

‘నేను అక్కడే ఉన్నాను. నిజం నాకు తెలుసు. వారు క్రిస్‌ రోజర్స్‌ గురించి మాట్లాడుకున్నారు. జట్టులో రోజర్స్‌ గొప్ప సభ్యుడు. కానీ ప్రజలు వారికి నచ్చింది ఊహించికొని ప్రచారం చేసుకుంటున్నారు. దానికి మేము బాధ్యత వహించలేం. ఎవరైనా గొప్పగా ఆడుతుంటే వారిపై ఇలాంటివి సృష్టిస్తారని తెలుసు. ఈ సిరీస్‌లో ఆటగాళ్లు గొప్పగా పోరాడుతున్నారు’ అని లాంగర్‌ అన్నాడు. మూడో టెస్టులో బెన్ స్టోక్స్‌కు లీచ్‌ అండగా నిలవడంతో ఇంగ్లాండ్‌ వికెట్‌ తేడాతో గెలిచి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. యాషెస్‌ సిరీస్‌లో స్మిత్ ఇంగ్లాండ్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. మూడు టెస్టుల్లో 134.2 సగటుతో ఏకంగా 671 పరుగులు చేశాడు. నాలుగో టెస్టులో డబుల్‌ సెంచరీతో పాటు 82 పరుగులు చేసిన అతడు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...