చంద్రబాబు గృహనిర్బంధం

గుంటూరు :  తెదేపా, వైకాపాలు పోటాపోటీగా ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. ‘చలో ఆత్మకూరు’కు వెళ్లకుండా ఆయన నివాసం వద్ద అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు సంఘీభావంగా అందరూ నిరసనలను తెలపాలని కోరారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో  గుంటూరు జిల్లాలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. పల్నాడులో 30 పోలీసు యాక్టు అమలు చేస్తున్నారు.  

కొనసాగుతున్న నేతల అరెస్టులు..

‘చలో ఆత్మకూరు’ నేపథ్యంలో పోలీసులు.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును, గద్దె రామ్మోహన్‌రావు, కృష్ణాజిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమామహేశ్వరరావును, ప్రకాశం జిల్లాలో శిద్దా రాఘవరావు, అశోక్‌రెడ్డిలను హౌస్‌ అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా నుంచి ఆత్మకూరుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న కొందరు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని నూజివీడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. పల్నాడు ప్రాంతంలో పలువురు తెదేపా నేతలను పోలీసుస్టేషన్‌కు పిలిపించి ‘చలో ఆత్మకూరు’లో పాల్గొనకూడదని సంతకాలు తీసుకుని బైండోవర్‌ చేసి పంపారు. నరసరావుపేట తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అరవిందబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి యాదవ్‌లకు నోటీసులు జారీ చేశారు. సత్తెనపల్లిలో మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ రామస్వామి, మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ పెదకరిముల్లా, పట్టణ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావులతో పాటు 14 మందిని బైండోవర్‌ చేశారు. పిడుగురాళ్లలో డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. దుర్గి మండల కేంద్రంలో రెండు పోలీసు బెటాలియన్లను అందుబాటులో ఉంచారు. మాజీ సర్పంచి ఏసుబు సాయంతో డీఎస్పీ శ్రీహరిబాబు గ్రామాలను వదిలిపెట్టి ముటుకూరు, గంగమహేశ్వరపాడు, కోలగుట్ల గ్రామాల్లో ఉన్నవారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల పోలీసు డివిజన్లలో 144వ సెక్షన్‌ విధించడంతో ఎక్కడా గుంపులుగా ఉండకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


మరిన్ని

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

రాజధాని కోసం ఆగిన మరో గుండె [00:55]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

ఆ రైల్వే స్టేషన్లలో సంస్కృతం [00:54]

ఉత్తరాఖండ్‌ రైల్వేస్టేషన్లలోని నామ ఫలకాలపై ఉర్దూ స్థానంలో ఇకపై సంస్కృతం వచ్చి చేరనుంది. రైల్వే ప్లాట్‌ఫాంపై ఉండే నామ ఫలకాలు ఆ రాష్ట్రానికి చెందిన ద్వితీయ భాష....

సరికొత్త లుక్‌లో బాలకృష్ణ.. ఎందుకోసం..? [00:54]

పాత్ర అంటే ప్రాణం పెట్టే నటుల్లో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం [00:53]

గుజరాత్‌ రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లా ఘోర దేవ్‌పరా వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

ఫేస్‌బుక్‌ పోస్టు.. సినిమాలాంటి ట్విస్టు [00:53]

మంచి చేసేవాళ్లకు ఎప్పటికైనా మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ వార్త చదివితే ఎవరికైనా అది  నిజమనిపించక మానదు.

రూపాయి విలువ చేసే చాక్లెట్లు దొంగిలించాడని.. [00:53]

బెంగళూరులో దారుణం జరిగింది. రెండు చాక్లెట్లు దొంగిలించినందుకు ఓ బాలుడి జుట్టు, కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు ఓ సూపర్‌ మార్కెట్‌ యజమాని కత్తిరించాడు...........

హైదరాబాద్‌లో కాళ్లు,చేతులు కట్టి ఉరేశారు! [00:53]

గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి ఉరివేసిన ఘటన హైదరాబాద్‌ శివారులో చోటుచేసుకుంది. బాలాపూర్‌ ఠాణా పరిధిలో...

రిలయన్స్‌ పెట్రోల్‌ పంపుల్లో విక్రయాల జోరు [00:52]

దేశీయ చమురు రంగ దిగ్గజం రిలయన్స్‌ చమురు రిటైల్‌ మార్కెట్లో కూడా తన హవా కొనసాగిస్తోంది. రిలయన్స్‌కు చెందిన దాదాపు 1,400 పెట్రోల్‌...