శతకం చేజార్చుకున్న శుభ్‌మన్‌ గిల్‌

తిరువనంతరపురం: దక్షిణాఫ్రికా-ఎతో జరుగుతున్న అనధికార టెస్టులో భారత్-ఎ పట్టుబిగిస్తోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సఫారీలను కట్టడి చేస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 129/2తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 303 పరుగులు సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ (90) శతకాన్ని చేజార్చుకున్నాడు. సక్సేనా (61*) అర్ధశతకం బాదాడు. దీంతో భారత్‌కు 139 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఐదు వికెట్లను కోల్పోయింది. భారత్ కంటే 14 పరుగుల వెనక ఉంది. ప్రస్తుతం క్రీజ్‌లో క్లాసెన్ (35*), వియాన్ ముల్డర్‌ (12*) ఉన్నారు. ఇప్పటికీ రెండు రోజులే పూర్తికావడంతో భారత్‌ విజయం ఖాయమనిపిస్తోంది. భారత్‌ బౌలర్లలో నదీమ్‌ 2, సిరాజ్, శార్దూల్‌ ఠాకూర్‌, గౌతమ్‌ తలో వికెట్‌ తీశారు.

మరిన్ని

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...