‘మోదీ ప్రభుత్వ తదుపరి అజెండా అదే’!

జమ్మూ‌: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత భూభాగంలో కలపడమే కేంద్ర ప్రభుత్వం తదుపరి అజెండా అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. దీనికి సంబంధించి పి.వి నర్సింహారావు హయాంలోనే పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తుచేశారు. ‘‘ఇక ప్రభుత్వ తదుపరి అజెండా పాక్‌ ఆక్రమిక కశ్మీర్‌ స్వాధీనం చేసుకొని భారత్‌లో కలపడమే. ఇది మా పార్టీ నిర్ణయం మాత్రమే కాదు.. నాటి ప్రధాని పి.వి.నరసింహారావు హయాంలో 1994లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది’’ అని జితేంద్ర సింగ్ అన్నారు. జమ్మూలో మోదీ 100రోజుల పాలనపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ 100రోజుల పాలనలో అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొన్నారని.. అందులో అధికరణ 370 రద్దు ప్రభుత్వం సాధించిన గొప్ప విజయాల్లో ఒకటని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎక్కడా కర్ఫ్యూ, కఠిన నిషేధాజ్ఞలు విధించలేదన్నారు. 

కశ్మీర్‌పై తీసుకొన్న నిర్ణయంతో ఆ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ జరిగి భారీ స్థాయిలో యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని పునరుద్ఘాటించారు. కశ్మీర్‌ విషయంలో ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయన్నారు. ప్రస్తుతం భారత్‌ ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందన్నారు. సాహసోపేతమైన నిర్ణయాలతో వాటన్నింటిని పరిష్కరించే దిశగా పాలన సాగుతోందన్నారు.  5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందన్నారు. మౌలిక, సామాజిక రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించడం అందులో భాగమేనన్నారు. విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 

మరిన్ని

తెదేపా నేతల గృహనిర్బంధం [01:05]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలపై ఆంక్షలు [00:55]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [01:04]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

దీపికపై అభిమానుల ఫైర్‌ [01:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కొత్త నిబంధనలు [01:32]

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణలో రాయితీ విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం అర్ధరాత్రితో మంగళం పాడింది. ప్రస్తుతం వివిధ రకాల ద్వారా దర్శనం చేసుకునే యాత్రికులకు...

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [01:05]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్యను హేయమైందిగా చంద్రబాబు పేర్కొన్నారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు

మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకున్నారు:రేవంత్‌ [01:04]

దిల్లీ నుంచి తాను నిధులు తీసుకొస్తానని.. వాటిని సక్రమంగా ఖర్చు పెట్టాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. కాలనీలను అభివృద్ధి చేయాలంటే...

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

రాజధాని కోసం ఆగిన మరో గుండె [00:55]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...