ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు: చంద్రబాబు

అమరావతి : నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి వెళ్లకుండా చంద్రబాబును పోలీసులు ఈ ఉదయం గృహనిర్బంధం చేశారు. దీంతో ఆయన నివాసంలోనే నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో తెదేపా నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా? అని నిలదీశారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజని పేర్కొన్నారు. పునరావాస శిబిరానికి ఆహారం సరఫరా అడ్డుకుంటారా? అని మండిపడ్డారు. శిబిరాల్లో బాధితులకు ఇచ్చే ఆహారం అడ్డుకోవడం అమానుష చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. ఒక పవిత్ర లక్ష్యం కోసం తాము పోరాటం చేస్తున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. సొంత ఊళ్లో నివసించే హక్కు కోసం చేస్తున్న పోరాటమన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. న్యాయం చేయాలని కోరితే తెదేపాపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. మనం నిరంకుశ పాలనలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని నిలదీశారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన చేయాలని కార్యకర్తలను కోరారు. బాధితులకు న్యాయం జరిగేవరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. 

చలో ఆత్మకూరు నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాకుండా పోలీసులు తెదేపా నేతలు,కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

 

 

 


మరిన్ని

13 అంతస్తుల భవనంపైకి ఎక్కి రైతుల నిరసన [13:36]

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ భవనంపైకి ఇద్దరు రైతులు ఎక్కడం ఆందోళన కలిగిస్తోంది. తుళ్లూరు, నెక్కల్లు గ్రామాలకు చెందిన కొందరు రైతులు నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మె్ల్యే క్వార్టర్స్‌ వద్ద

‘డమ్మీ కాన్వాయ్‌తో ట్రయల్‌ రన్‌..సిగ్గుచేటు’ [19:32]

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పెరిగే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ ఒప్పందం చేసుకున్నారని.. అందుకే అమరావతిని చంపేస్తున్నారని...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [20:54]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం [23:44]

గుజరాత్‌ రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లా ఘోర దేవ్‌పరా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలవగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వీరంతా గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [23:38]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు ఉన్నారని, ప్రభుత్వానికి తమ ఆకాంక్షలను తెలియజేయాలనుకున్న తరుణంలో ఈ విధమైన అణిచివేత చర్యలు...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [23:32]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

తెదేపా నేతల గృహనిర్బంధం [23:24]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

రాజధాని కోసం ఆగిన మరో గుండె [23:19]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

దీపికపై అభిమానుల ఫైర్‌ [23:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

ఫేస్‌బుక్‌ పోస్టు.. సినిమాలాంటి ట్విస్టు [22:52]

మంచి చేసేవాళ్లకు ఎప్పటికైనా మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ వార్త చదివితే ఎవరికైనా అది  నిజమనిపించక మానదు.