43 ఏళ్ల రికార్డు వేటలో స్మిత్‌..!

లండన్: ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌స్మిత్‌ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఒకే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజం వివ్‌రిచర్డ్స్‌ రికార్డు సృష్టించాడు. 1976లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతడు 829 పరుగులతో రికార్డు నెలకొల్పాడు. అనారోగ్య కారణంతో ఐదు టెస్టుల సిరీస్‌లో రిచర్డ్స్‌ నాలుగు మ్యాచులు మాత్రమే ఆడాడు. ఈ జాబితాలో భారత ఆటగాడు సునిల్‌ గవాస్కర్‌ 774 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. గవాస్కర్ తర్వాతి స్థానాల్లో గ్రాహమ్‌ గూచ్‌ (752), బ్రియన్‌ లారా (688) ఉన్నారు.

రిచర్డ్స్‌ పేరిట ఉన్న 43 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టడానికి స్మిత్‌కు మరో 159 పరుగులు అవసరం. బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన స్మిత్‌ యాషెష్‌ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌లో తిరిగి అడుగుపెట్టాడు. పునరాగమనం తర్వాత అతడు అద్వితీయమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో మూడు మ్యాచులు ఆడిన అతడు 134.20 సగటుతో 671 పరుగులు చేశాడు. నాలుగో టెస్టులో ద్విశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్న అతడు కోహ్లీని అధిగమించి 937 రేటింగ్‌ పాయింట్లతో టెస్టుల్లో తొలిర్యాంకును దక్కించుకొన్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై ఆసీస్‌ 2-1తో పైచేయి సాధించింది. సెప్టెంబర్‌ 12 నుంచి చివరి టెస్టు ప్రారంభం కానుంది.

మరిన్ని

విశాఖలో ‘అల..’ విజయోత్సవ సభ [00:36]

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా విడుదలై రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సందర్భంగా...

భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు [00:05]

భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....