మాజీ మంత్రుల అరెస్టు

విజయవాడ: తెలుగు దేశం పార్టీ అధినేత పిలుపు మేరకు ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి వెళుతున్న పలువురు తెదేపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి అఖిలప్రియను విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో అరెస్టు చేశారు. అయితే, అనుమతి లేకుండా పోలీసులు ఆమె గదిలోకి రావడంపై అఖిలప్రియ అభ్యంతరం వ్యక్తం చేశారు. హోటల్‌ యాజమాన్యంపైనా ఆమె అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరు సరిగాలేదన్నారు. అనుమతి లేకుండా తన గది, తన బంధువుల గదిలో పోలీసులు తనిఖీ చేయడాన్ని అఖిల ప్రియ తప్పుబట్టారు. అల్పాహారం తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం 7గంటల నుంచి హోటల్‌ బయటకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, హోటల్‌ యాజమాన్యం, అఖిల ప్రియ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆమె పోలీసులు అదుపులోనే ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి అచ్చెన్నాయుడును చంద్రబాబు నివాసం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా విజయవాడలో గృహనిర్బంధంలో ఉంచారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కూడా గృహనిర్బంధం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, తెదేపా నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇంటి ముందే తంగిరాల సౌమ్య, ఇతర నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు.

 


మరిన్ని

తెదేపా నేతల గృహనిర్బంధం [01:05]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలపై ఆంక్షలు [00:55]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [01:04]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

దీపికపై అభిమానుల ఫైర్‌ [01:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కొత్త నిబంధనలు [01:32]

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణలో రాయితీ విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం అర్ధరాత్రితో మంగళం పాడింది. ప్రస్తుతం వివిధ రకాల ద్వారా దర్శనం చేసుకునే యాత్రికులకు...

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [01:05]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్యను హేయమైందిగా చంద్రబాబు పేర్కొన్నారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు

మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకున్నారు:రేవంత్‌ [01:04]

దిల్లీ నుంచి తాను నిధులు తీసుకొస్తానని.. వాటిని సక్రమంగా ఖర్చు పెట్టాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. కాలనీలను అభివృద్ధి చేయాలంటే...

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

రాజధాని కోసం ఆగిన మరో గుండె [00:55]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...