సఫారీలపై ‘వీర’విహారం ఇది..!

భారత్‌ టెస్టు క్రికెట్‌ ప్రస్థానం మొదలై దాదాపు 87 ఏళ్లు అవుతోంది. కానీ, ఇప్పటివరకు సుదీర్ఘ ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా తరఫున నమోదైన ట్రిపుల్ సెంచరీలు కేవలం మూడే. వాటిలో రెండు డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌వే‌. సెహ్వాగ్‌ అంటే క్రికెట్‌ ప్రపంచానికి గుర్తొచ్చేది అతడి విధ్వంసమే. బౌలర్ల పాలిట అతడు అరివీర భయంకరుడు. క్రీజ్‌లో ఉన్నంతసేపు బౌలర్లకు పీడకలగా మార్చే మహాయోధుడు. ఫుట్‌వర్క్‌ లేకుండా ఉన్నచోట నుంచే బంతిని బౌండరీ దాటించే  హిట్టర్‌. సుదీర్ఘ ఫార్మాట్‌లో శతకొట్టాలంటే మహామహా బ్యాట్స్‌మెన్‌కు క్రీజ్‌లో కుదురుకుంటే సరిపోతుంది. ద్విశతకం బాదాలంటే కాస్త ఓర్పు ఉంటే పనైపోతుంది. అదే ట్రిపుల్ సెంచరీ చేయాలంటే..? అంత తేలికైన విషయం కాదు. కానీ, అలాంటి త్రిశతకాలను సెహ్వాగ్‌ ఏకంగా రెండు సార్లు బాదేశాడు. తొలి ట్రిపుల్‌ సెంచరీని చిరకాల ప్రత్యర్థి పాక్‌పై బాదగా రెండోది సఫారీలపై చేశాడు. మరో కొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరేంద్రుని వీరవిహారాన్ని ఓ సారి చూద్దాం..


 

వివ్ రిచర్డ్స్‌ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత దూకుడు ఇన్నింగ్స్‌ ఆడే ఆటగాడి కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు. హిట్టింగ్‌ చేస్తున్నా అతడి స్థాయిలో ఎవరూ గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. కానీ వీరేంద్ర సెహ్వాగ్‌ రాకతో విధ్వంసం కోరుకునే అభిమానులు ఎంతో సంతోషించారు. భారత్‌ తరఫున వీరేంద్ర సెహ్వాగ్‌ 1999లో అరంగ్రేటం చేశాడు. తొలి మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఒక పరుగు మాత్రమే చేశాడు. తర్వాత ఎన్నో మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. గంగూలీ జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత సెహ్వాగ్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. కివీస్‌పై శతకం బాది అతడి స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు. టీమ్‌ఇండియా డాషింగ్‌ ఓపెనర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.

2008లో దక్షిణాఫ్రికా భారత్‌లో పర్యటించింది. టీమ్‌ఇండియాతో మూడు టెస్టులు ఆడింది. సిరీస్‌ను డ్రాగా ముగించినా సఫారీలకు చేదు అనుభవమే మిగిలింది. సెహ్వాగ్‌ ఊచకోతకు పర్యటన పీడకలగా మారింది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో తొలి టెస్టు జరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో గ్రేమ్‌స్మిత్‌ సేన 540 పరుగులు చేసింది. హషీమ్‌ ఆమ్లా 159 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్‌కు కష్టాలు తప్పవని భావించారంతా. కానీ సెహ్వాగ్‌ ఇన్నింగ్స్‌ను చూసిన తర్వాత కష్టాలు టీమ్‌ఇండియాకు కాదు సఫారీలకు అనేలా పరిస్థితి మారిపోయింది. అలా సాగింది సెహ్వాగ్‌ విధ్వంసం. స్పిన్నర్, పేసర్‌ అనే తేడా లేకుండా సఫారీ బౌలర్లను ఊచకోత కోశాడు. 42 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 319 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడికి తోడుగా ఇండియన్ వాల్‌ రాహుల్ ద్రవిడ్‌ శతకంతో కదంతొక్కగా భారత్‌ 627 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రాణించడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్‌ రెండు కీలక వికెట్లు కూడా పడగొట్టాడు. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌, వికెట్‌ కీపర్‌ మార్క్‌ బౌచర్‌ను బోల్తా కొట్టించాడు. మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది.

‘‘వికెట్‌ కాపాడుకోవడం కంటే పరుగులు చేయడమే ముఖ్యం. కొట్టాల్సిన బంతి వచ్చినప్పుడు కొట్టడమే నా పని. అది నా సహజ స్వభావం. మ్యాచ్‌ తొలి బంతి అయినా, సెంచరీకి చేరువలోనైనా విధ్వంసమే నా లక్ష్యం’’: సెహ్వాగ్‌

కరుణ్‌ నాయర్‌ చలవతో చెన్నైలోని చెపాక్‌ స్టేడియం భారత బ్యాట్స్‌మెన్‌ ట్రిపుల్‌ సెంచరీలకు వేదికగా మారిపోయింది. సెహ్వాగ్‌ భారీ ఇన్నింగ్స్‌ సాధించిన చెపాక్‌ స్టేడియంలోనే ఎనిమిదేళ్ల తర్వాత యువ ఆటగాడు కరుణ్‌ నాయర్‌ త్రిశతకం బాదేశాడు. 2016లో భారత్‌ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్‌పై అతడు విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ చేసిన 477 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ను టీమ్‌ఇండియా అందుకుంటుందో లేదో అని అందరూ అనుకున్నారు. కానీ కరుణ్‌ నాయర్‌ ట్రిపుల్‌ సెంచరీతో పాటు రాహుల్‌ 199 పరుగులతో చెలరేగగా భారత్‌ ఏకంగా 759 రికార్డు పరుగులు సాధించి మ్యాచ్‌ను గెలుచుకుంది. కరుణ్‌ నాయర్‌ తర్వాత భారత్‌ తరఫున ఇప్పటివరకు త్రిశతకాన్ని ఎవరూ సాధించలేకపోయారు. ప్రస్తుత భారత జట్టులో స్టార్‌ బ్యాట్స్‌మన్‌కు కొదవలేదు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ, నయా వాల్‌ ఛతేశ్వర్‌ పుజారా, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ, అజింక్య రహానె వంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లతో పాటు హనుమ విహారి, మయాంక్‌ అగర్వాల్‌, రిషభ్‌ పంత్‌ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లంతా సంచనాలను సృష్టించగలిగే బ్యాట్స్‌మెన్‌. అక్టోబర్‌ 2 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్‌ మూడు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌లో సెహ్వాగ్‌, కరుణ్‌ త్రిశతక రికార్డును ఎవరైనా అందుకుంటారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

మరిన్ని

రాహుల్‌ ద్విపాత్రాభినయం.. పంత్‌కు చేటా? [00:38]

ధోనీ తర్వాత టీమిండియా కీపర్‌గా, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న రిషభ్‌ పంత్‌ వన్డే ప్రపంచకప్‌ తర్వాత పూర్తిగా విఫలమయ్యాడు. గత నెల వెస్టిండీస్‌తో పరిమిత...

లబుషేన్ నిర్భీతిగా ఆడాడు: స్మిత్‌ [12:19]

ఆసీస్‌ యువ బ్యాట్స్‌మన్ లబుషేన్‌ను ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. లబుషేన్‌కు ఎంతో ప్రతిభ ఉందని కొనియాడాడు. ‘‘లబుషేన్ తన తొలి వన్డేలోనే అద్భుతంగా ఆడాడు. కుల్‌దీప్‌ యాదవ్ బౌలింగ్‌లో నిర్భీతిగా ఆడుతూ

పృథ్వీషా 150: జట్టులో స్థానం ఖరారేనా! [15:09]

న్యూజిలాండ్‌ ఎలెవన్‌ జట్టుతో జరుగుతున్న వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మన్ పృథ్వీషా చెలరేగాడు. 22 ఫోర్లు, రెండు సిక్సర్లతో 100 బంతుల్లోనే 150 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు తిరిగి భారత జట్టులోకి వస్తాడని అందరూ భావిస్తున్నారు.

అండర్‌ 19లో యువ భారత్‌ విజయం [21:54]

అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. శ్రీలంక జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది...

2-1తేడాతో లెక్క సరిచేశారు [21:13]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్‌ కైవసం చేసుకుంది...

అండర్‌ 19 ప్రపంచకప్‌: చితక్కొట్టిన భారత్‌ [17:53]

అండర్‌ 19 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో యువ భారత్‌ దంచి కొట్టింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న శ్రీలంక భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది...

భారత్‌ లక్ష్యం 287 [17:23]

టీమిండియాతో జరుగుతున్న మూడో నిర్ణయాత్మక వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది...

ఆసీస్‌ మ్యాచ్‌లో ధావన్‌కు గాయం [14:17]

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు గాయమైంది. బుమ్రా బౌలింగ్‌లో ఫించ్‌ ఆడిన షాట్‌ను అడ్డుకునే యత్నంలో ధావన్‌ ఎడమ భుజానికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. డైవ్‌ చేసిన తర్వాత

రెజ్లర్‌ రవికుమార్‌కు స్వర్ణం [13:48]

రోమ్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ ఈవెంట్లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. భారత రెజ్లర్‌ రవికుమార్‌ దాహియా స్వర్ణం సాధించాడు. 61 కేజీల విభాగం ఫైనల్లో అబ్దులియేవ్‌ (కజిఖ్‌స్థాన్‌)ను 12-2తో చిత్తుగా ఓడించాడు. అంతకుముందు భారత రెజ్లర్‌ బజ్‌రంగ్‌ (65 కేజీ)

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ [13:06]

భారత్×ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా మరికొద్దిసేపట్లో ఆఖరి వన్డే ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే 1-1తో సమంగా నిలిచిన ఇరుజట్లు సిరీస్‌ కైవసం