నాని నటనకు విక్రమ్‌ ఫిదా

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యువ కథానాయకుడు నాని నేచురల్‌గా నటిస్తారనే విషయం తెలిసిందే. ఆయన నటనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. తాజాగా నాని నటనకు ప్రముఖ దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ ఫిదా అయ్యారు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నాని నటనను చూసి దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా మేకింగ్‌ వీడియోని చిత్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ అభిమానులతో పంచుకుంది. సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో హీరో నానితోపాటు దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ నవ్వులు పూయిస్తూ ఈ వీడియోలో కనిపించారు. అంతేకాకుండా ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌ ఓ షాట్‌లో మెరిశారు. 

విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రం సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం కార్తికేయ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.వి.శంకర్‌, మోహన్‌ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలను అందిస్తున్నారు.


మరిన్ని

తెదేపా నేతల గృహనిర్బంధం [01:05]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలపై ఆంక్షలు [00:55]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [01:04]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

దీపికపై అభిమానుల ఫైర్‌ [01:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కొత్త నిబంధనలు [01:32]

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణలో రాయితీ విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం అర్ధరాత్రితో మంగళం పాడింది. ప్రస్తుతం వివిధ రకాల ద్వారా దర్శనం చేసుకునే యాత్రికులకు...

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [01:05]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్యను హేయమైందిగా చంద్రబాబు పేర్కొన్నారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు

మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకున్నారు:రేవంత్‌ [01:04]

దిల్లీ నుంచి తాను నిధులు తీసుకొస్తానని.. వాటిని సక్రమంగా ఖర్చు పెట్టాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. కాలనీలను అభివృద్ధి చేయాలంటే...

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

రాజధాని కోసం ఆగిన మరో గుండె [00:55]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...