ఐఫోన్‌ 11.. భారత్‌లో ధర ఎంతంటే?

కాలిఫోర్నియా: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త ఐఫోన్లు వచ్చేశాయ్‌. కాలిఫోర్నియాలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌లను కంపెనీ సీఈవో టిమ్‌కుక్‌ ఆవిష్కరించారు. తాజాగా ఈ ఫోన్ల భారత ధరలను యాపిల్‌ ప్రకటించింది. భారత మార్కెట్లో ఐఫోన్‌ 11 ధర రూ. 64,900 నుంచి ప్రారంభం కానుంది. 

ఐఫోన్‌ 11 మొత్తం మూడు వేరియంట్లలో లభించనుంది. 64జీబీ వేరియంట్‌ ధర రూ. 64,900 కాగా.. 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 69,900, 256జీబీ వేరియంట్ ధర రూ. 79,900గా నిర్ణయించింది. ఇక ఐఫోన్‌ 11 ప్రో ధర రూ. 99,900, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌ ధర రూ. 1,09,900గా ఉండనున్నట్లు యాపిల్‌ వెల్లడించింది. అమెరికా సహా ఇతర దేశాల్లో ఈ నెల 20 నుంచి వీటి విక్రయాలు ప్రారంభమవనుండగా.. భారత్‌లో మాత్రం సెప్టెంబరు 27 నుంచి కొత్త ఐఫోన్లు వినియోగదారులకు అందుబాటులో రానున్నాయి.  

ఫోన్లతో పాటు ఇతర గ్యాడ్జెట్లను కూడా యాపిల్‌ నిన్న ఆవిష్కరించింది. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 5(జీపీఎస్‌) ధర రూ. 40,900 నుంచి, వాచ్‌ సిరీస్‌ 5(జీపీఎస్‌ + సెల్యూలార్‌) ధర రూ. 49,900 నుంచి ప్రారంభం కానుంది. యాపిల్‌ టీవీ ప్లస్‌ సేవల నెలవారీ చందాను రూ. 99గా నిర్ణయించారు. 

మరిన్ని

జీవిత బీమాతో ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌ [00:51]

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ జీవిత బీమాతో కూడిన మరో ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను తీసుకొచ్చింది. రూ.2లక్షల జీవిత బీమాతో కూడిన రూ.179 ప్రీపెయిడ్‌...

రిలయన్స్‌ పెట్రోల్‌ పంపుల్లో విక్రయాల జోరు [00:52]

దేశీయ చమురు రంగ దిగ్గజం రిలయన్స్‌ చమురు రిటైల్‌ మార్కెట్లో కూడా తన హవా కొనసాగిస్తోంది. రిలయన్స్‌కు చెందిన దాదాపు 1,400 పెట్రోల్‌...

ఎన్నెన్నో ప్రకటనలు.. కొన్నే అమలు..! [00:52]

ప్రభుత్వాలు బడ్జెట్లలో ఎన్నో ప్రకటనలను ఆర్థికమంత్రి చేస్తుంటారు. కానీ, వాస్తవంగా వీటిల్లో కొన్నే అమలవుతాయి. ప్రతి ప్రభుత్వంలో ఇవి సర్వసాధారణం...

తదుపరి బోర్డు సమావేశంలో డివిడెండ్‌పై నిర్ణయం! [00:50]

రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) కేంద్రానికి ఇవ్వాల్సిన మధ్యంతర డివిడెండు అంశంపై తదుపరి సెంట్రల్‌ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు మీడియా వర్గాల నుంచి సమాచారం.