ఎన్ని రోజులు నిర్బంధంలో ఉంచుతారో చూస్తా

గృహనిర్బంధంపై చంద్రబాబు ఆగ్రహం

అమరావతి: ‘చలో ఆత్మకూరు’కు తన నివాసం నుంచి బయల్దేరుతున్న తనను గృహనిర్బంధం చేయడంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. తమ పార్టీ చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న తెదేపా నేతల నిర్బంధ కాండపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఈ పరిస్థితులు చాలా దారుణమని, దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తనను గృహనిర్బంధం చేశారన్నారు. అమరావతిలోని తన నివాసం నుంచి బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి వచ్చే తమ పార్టీ నాయకులను గృహనిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చిన వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించడం.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి ఒక పోలీస్‌ స్టేషన్‌ నుంచి మరో పోలీస్‌ స్టేషన్‌కు తిప్పడం మంచి పద్ధతికాదని మండిపడ్డారు. ఆత్మకూరులో 120 ఎస్సీ కుటుంబాలు శిబిరంలో ఉంటే అక్కడికి భోజనాలు కూడా రానీయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ ఇంట్లోకి పనివాళ్లను కూడా రానీయకుండా అడ్డుకున్నారని.. పోలీసులు అత్యుత్సాహంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారన్నారు. ఈ ఘటనలన్నీ పాలించే వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. తనను ఎన్ని రోజులు గృహనిర్బంధం చేస్తారో చూస్తానన్నారు.

‘చలో ఆత్మకూరు’ రద్దుచేసుకొనే ప్రసక్తేలేదు

మొత్తం 540 బాధిత కుటుంబాలను తమతమ గ్రామాలకు తరలించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టంచేశారు. మనిషికి జీవించే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ, వారి ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వీటిని పోలీసులు అమలు చేయాలన్నారు. బాధితులను తమ స్వగ్రామాలకు తరలించేందుకు  నిన్నటి వరకు తాము గడువు ఇచ్చామని.. ఈ రోజు చలో ఆత్మకూరుకు బయల్దేరితే తనను అడ్డుకున్నారని మండిపడ్డారు. చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని రద్దు చేసుకొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.  అరెస్టులు, నిర్బంధాలతో చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకోలేరన్నారు. తమ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆపలేరన్నారు. చలో ఆత్మకూరు కొనసాగుతుందని స్పష్టంచేశారు. సమస్య పరిష్కారమయ్యేవరకూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టంచేశారు. 

అనుమతించే దాకా కారులోనే కూర్చుంటా!
మరోవైపు చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెదేపా అధినేత ఆత్మకూరు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు ఆయనను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. గేటుకు తాళం వేశారు. దీంతో చంద్రబాబు తన కారులోనే కూర్చొన్నారు. తనను చలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతించేదాకా అక్కడే వుంటానని ఆయన పోలీసులకు తేల్చి చెప్పారు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు.

 

 


మరిన్ని

తెదేపా నేతల గృహనిర్బంధం [01:05]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలపై ఆంక్షలు [00:55]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [01:04]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

దీపికపై అభిమానుల ఫైర్‌ [01:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [01:05]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్యను హేయమైందిగా చంద్రబాబు పేర్కొన్నారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు

మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకున్నారు:రేవంత్‌ [01:04]

దిల్లీ నుంచి తాను నిధులు తీసుకొస్తానని.. వాటిని సక్రమంగా ఖర్చు పెట్టాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. కాలనీలను అభివృద్ధి చేయాలంటే...

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

రాజధాని కోసం ఆగిన మరో గుండె [00:55]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

ఆ రైల్వే స్టేషన్లలో సంస్కృతం [00:54]

ఉత్తరాఖండ్‌ రైల్వేస్టేషన్లలోని నామ ఫలకాలపై ఉర్దూ స్థానంలో ఇకపై సంస్కృతం వచ్చి చేరనుంది. రైల్వే ప్లాట్‌ఫాంపై ఉండే నామ ఫలకాలు ఆ రాష్ట్రానికి చెందిన ద్వితీయ భాష....