మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అరెస్టు

ఏలూరు: తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలోని తన నివాసంలోనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను  ఏలూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. పది రోజుల క్రితం చింతమనేనిపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. అప్పట్నుంచి ఆయన అజ్ఞాతంలో ఉండగా.. 12 పోలీసు బృందాలు ఆయన కోసం గాలింపు చేపట్టాయి. ఈ పరిస్థితుల్లోనే దుగ్గిరాలలోని ఆయన నివాసానికి ఈ రోజు భారీగా చేరుకున్న పోలీసులు ఇంట్లోని గదులు, కపోర్డుల్లో సోదాలు నిర్వహించారు. ఎలాంటి సెర్చ్‌ వారెంట్‌ లేకుండా తమ ఇంట్లో ఎలా సోదాలు చేస్తారని చింతమనేని తండ్రి పోలీసులను ప్రశ్నించారు. అయితే, తమను పట్టించుకోకుండా పక్కకు తోసి పోలీసులు సోదాలు చేశారని చింతమనేని ఇంట్లోని సిబ్బంది ఆరోపిస్తున్నారు. చింతమనేనిని అరెస్టుచేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తుండగా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్న తెదేపా కార్యకర్తలు, అనుచరులు పోలీసులను అడ్డుకుంటున్నారు. దీంతో దుగ్గిరాలలోని ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మరిన్ని

భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు [00:05]

భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....