చంద్రబాబువి అన్నీ నాటకాలే: వైకాపా

అమరావతి: దళితుల గురించి మాట్లాడే హక్కు తెదేపా అధినేత చంద్రబాబుకు లేదని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శిబిరాలు పెట్టడం హాస్యాస్పదమని..  పెయిడ్‌ ఆర్టిస్ట్‌లను ఉపయోగించుకొని చంద్రబాబు నాటకాలాడుతున్నారని ఆయన విమర్శించారు. ఆయన ఆడుతున్న నాటకాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. బుధవారం ఆయన వైకాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆత్మకూరు ప్రశాంతంగా ఉంటే చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విష్ణు మండిపడ్డారు. సాగునీటి రాకతో పల్నాడు రైతులంతా ఆనందంగా ఉంటే చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోడెల ట్యాక్స్‌ పేరుతో శివప్రసాదరావు చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావన్నారు. 

ఎన్ని అరాచకాలో చేశారో చూపిస్తాం రండి: జోగి రమేశ్
ఆత్మకూరు పేరుతో చంద్రబాబు నాటకాలాడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో అలజడి రేపేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. చంద్రబాబు దీక్ష గురించి ప్రజలెవరూ ఎదురు చూడట్లేదన్నారు. ప్రభుత్వానికి వున్న మంచిపేరును చెడగొట్టాలని  చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పెయిడ్‌ ఆర్టిస్ట్‌లను ఉపయోగించుకొని చంద్రబాబు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.   నరసరావుపేట, వినుకొండ, గురజాల, సత్తెనపల్లి.. చంద్రబాబు ఎక్కడికైనా రావొచ్చని.. కోడెల ట్యాక్స్‌ పేరుతో ఎన్ని అరాచకాలో చేశారో చూపిస్తామని సవాల్‌ విసిరారు. గనుల తవ్వకాల్లో యరపతినేని వందల కోట్ల ప్రజాధనం లూటీ చేశారని ఆరోపించారు. ఆత్మకూరు ప్రశాంతంగా ఉన్నా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని జోగు రమేశ్‌ మండిపడ్డారు.

మరిన్ని

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....