టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. ఎన్ని రోజులు నిర్బంధంలో ఉంచుతారో చూస్తా

‘చలో ఆత్మకూరు’కు తన నివాసం నుంచి బయల్దేరుతున్న తనను గృహనిర్బంధం చేయడంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. తమ పార్టీ చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న తెదేపా నేతల నిర్బంధ కాండపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఈ పరిస్థితులు చాలా దారుణమని, దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతిలోని తన నివాసం నుంచి బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి వచ్చే తమ పార్టీ నాయకులను గృహనిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనను ఎన్ని రోజులు గృహనిర్బంధం చేస్తారో చూస్తానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హిమాచల్‌ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనచే ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌, చింతల రామచంద్రారెడ్డి, జితెందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పల్నాడుకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి

తెదేపా, వైకాపా పోటాపోటీగా చేపట్టిన ‘చలో ఆత్మకూరు’ ఉద్రిక్తతకు దారి తీసింది. గుంటూరులోని వైకాపా కార్యాలయంలో వైకాపా నేతలు మీడియాతో మాట్లాడారు. వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే కాసు మహేశ్‌ రెడ్డి అన్నారు. పల్నాడుకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సాగర్‌ ఆధునికీకరణ, బుగ్గవాగు, పులిచింతల కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయన్నారు. తెదేపా నేతల అక్రమ మైనింగ్‌, ఇసుక దందాలను ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. ముఖం చెల్లకే పల్నాడు నేతలను చలో ఆత్మకూరుకు చంద్రబాబు పిలవలేదని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చింతమనేని ప్రభాకర్‌ అరెస్టు

తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలోని తన నివాసంలోనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను  ఏలూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. పది రోజుల క్రితం చింతమనేనిపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. అప్పట్నుంచి ఆయన అజ్ఞాతంలో ఉండగా.. 12 పోలీసు బృందాలు ఆయన కోసం గాలింపు చేపట్టాయి. ఈ పరిస్థితుల్లోనే దుగ్గిరాలలోని ఆయన నివాసానికి ఈ రోజు భారీగా చేరుకున్న పోలీసులు ఇంట్లోని గదులు, కపోర్డుల్లో సోదాలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మోస్ట్‌ వాంటెడ్‌ లష్కరే ఉగ్రవాది హతం!

అధికరణ 370 రద్దు తర్వాత ఓ పండ్ల వ్యాపారి కుటుంబంపై ఉగ్రమూకలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 30నెలల అస్మాజాన్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సైన్యం రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకొంది. ఈ దాడికి కారణమైన మోస్ట్‌ వాంటెడ్‌ లష్కరే టెర్రరిస్ట్‌ ఆసిఫ్‌ను బుధవారం భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం ఈరోజు ఉదయం భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య సోపోర్ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆసిఫ్‌ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 43 ఏళ్ల రికార్డు వేటలో స్మిత్‌..!

ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌స్మిత్‌ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఒకే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజం వివ్‌రిచర్డ్స్‌ రికార్డు సృష్టించాడు. 1976లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతడు 829 పరుగులతో రికార్డు నెలకొల్పాడు. అనారోగ్య కారణంతో ఐదు టెస్టుల సిరీస్‌లో రిచర్డ్స్‌ నాలుగు మ్యాచులు మాత్రమే ఆడాడు. ఈ జాబితాలో భారత ఆటగాడు సునిల్‌ గవాస్కర్‌ 774 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. గవాస్కర్ తర్వాతి స్థానాల్లో గ్రాహమ్‌ గూచ్‌ (752), బ్రియన్‌ లారా (688) ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘నిశ్శబ్దం’లో అనుష్కను చూశారా..!

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ సినిమాకి సంబంధించి అనుష్క ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా నేడు అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రంలో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా, ఈ సినిమాలో అనుష్క పాత్ర పేరు ‘సాక్షి’. ఈ విషయాన్ని తెలియాచేస్తూ.. పోస్టర్‌పై ‘‘సాక్షి’ ఏ మ్యూట్‌ ఆర్టిస్ట్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ‘భాగమతి’ హిట్‌ తర్వాత అనుష్క నటిస్తున్న ఈ చిత్రానికి మంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘చలో ఆత్మకూరు’కు వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

9. ఇస్మార్ట్‌ ప్రయాణికుడు

మోటారు వాహనాల చట్టం నూతన నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం మాట అటుంచితే.. జరిమానాల నుంచి వారు తప్పించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఒక వ్యక్తి కాస్త స్మార్ట్‌గా ఆలోచించాడు. తన తెలివితో ట్రాఫిక్‌ పోలీసుల దగ్గర మార్కులు కొట్టేశాడు. వడోదరకు చెందిన రామ్‌ షా అనే ఎల్‌ఐసీ ఏజెంట్‌ వృత్తిరీత్యా నిత్యం ద్విచక్ర వాహనంపై తిరగాలి. ఈ క్రమంలో పొరపాటున లైసెన్స్‌, ఇతర పత్రాలేవైనా మర్చిపోతానేమోనన్న భయంతో వాటిని ఏకంగా హెల్మెట్‌కే అంటించేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఐఫోన్‌ 11.. భారత్‌లో ధర ఎంతంటే?

స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త ఐఫోన్లు వచ్చేశాయ్‌. కాలిఫోర్నియాలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌లను కంపెనీ సీఈవో టిమ్‌కుక్‌ ఆవిష్కరించారు. తాజాగా ఈ ఫోన్ల భారత ధరలను యాపిల్‌ ప్రకటించింది. భారత మార్కెట్లో ఐఫోన్‌ 11 ధర రూ. 64,900 నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్‌ 11 మొత్తం మూడు వేరియంట్లలో లభించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని

చేబ్రోలు యువకుడి ‘జాబ్‌’పాట్‌.. ఒకేసారి 4 ఉద్యోగాలు [11:11]

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన రాయుడు త్రిమూర్తులు(27) అనే యువకుడు రాసిన ప్రతి పోటీ పరీక్షలోనూ ప్రతిభ కనబరిచి 5 నెలల కాలంలో 4 ఉద్యోగాలకు ...

ప్రధానోపాధ్యాయుడి దారుణ హత్య [12:51]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం తూరంగిలో వెంకట్రావు అనే ప్రధానోపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు...

ఒక్కో పరుగు తీసేందుకు కష్టపెడతారు [18:04]

ఇంగ్లాండ్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ జోడెన్లీ ఆసీస్‌ బౌలర్లను కొనియాడాడు. ఒక్కో పరుగు తీసేందుకు కంగారూలు చాలా కష్టపెడతారని చెప్పాడు. బ్యాట్స్‌మన్‌ ఓపెనింగ్‌ చేసే ప్రతీసారి బాగా ఆడి మంచి...

ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం నిజం కాదు: హరీశ్‌ [17:53]

కాంగ్రెస్‌, భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు అన్యాయం చేశాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎనిమిదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ పార్టీ పెట్టిన ఖర్చు రూ.107 కోట్లు కాగా.. తెరాస ప్రభుత్వం రూ.617 కోట్లు ఖర్చు పెట్టి,  

బోటులో వెళ్లిన పర్యాటకుల వివరాలివే! [17:43]

గోదావరిలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైనవారికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నదిలో గాలిస్తున్నాయి. రాయల్‌ వశిష్ఠ

హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్ధమయ్యారు! [17:31]

నందమూరి బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో సినిమా రాబోతోంది. వీరిద్దరూ ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలతో సక్సెఫుల్‌ కాంబినేషన్‌ అనిపించుకున్నారు. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకా సినిమా టైటిల్‌ ఖరారు చేయలేదని పేర్కొన్నారు. డిసెంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని తెలిపారు.

స్మిత్‌ అద్భుత క్యాచ్‌ చూశారా? [17:19]

శనివారం ఓవర్‌నైట్‌ స్కోర్‌ 9/0తో మూడోరోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్‌ మ్యాచ్‌పై పట్టుబిగించింది. జోడెన్లీ(94), బెన్‌స్టోక్స్‌(67), జోస్‌బట్లర్‌(47) రాణించడంతో భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది...

మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు [17:07]

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఘటనపై సీఎం జగన్‌ అధికారులతో

టాప్‌ 10 న్యూస్‌@ 5 PM [16:59]

తూర్పుగోదావరి జిల్లా కచులూరు మందం దగ్గర గోదావరిలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదం విషాదాంతమైంది. బోటులో పాపికొండల పర్యాటకానికి వెళ్లిన వారిలో ఇప్పటి వరకు 12 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 24 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు సమాచారం.

పీవీ అమ్మకాల్లో పడిన మారుతీ వాటా [16:57]

వాహనాల అమ్మకాల్లో మందగమనం నేపథ్యంలో దేశీయంగా ప్రయాణికుల వాహనాలను (పీవీ) తయారు చేసే మారుతీ సుజుకీ, టాటామోటార్స్‌ మార్కెట్‌ వాటాలు పడిపోయాయి. ఏప్రిల్‌-ఆగస్టు అమ్మకాల్లో ఆ