నా జీవితంలో ఇదో నూతన అధ్యాయం

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన సిమ్లాలో మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయడం తన జీవితంలో ఒక నూతన అధ్యాయమన్నారు. రాజకీయాల్లో అంకితభావంతో పనిచేశాననీ.. అదే స్ఫూర్తితో ఇప్పుడు పని చేస్తానన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరిస్తానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సమర్థంగా నిర్వహించి.. వారి నమ్మకాన్ని నిలబెడతానన్నారు. 

రాజకీయాలను ప్రస్తావించబోను

హిమాచల్‌ ప్రదేశ్‌ మునులు, రుషులు తప్పస్సు చేసుకున్న దైవ భూమి అని.. ఇలాంటి వీర భూమిలో పని చేసే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇక్కడ చదువుకున్న వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి నిరుద్యోగ సమస్య లేకుండా చేసేందుకు పాటుపడతానని చెప్పారు. పర్యాటకంలో దక్షిణాది రాష్ట్రాలను అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తామన్నారు. బడుగు బలహీన, కార్మిక వర్గాలకు లబ్ధి చేకూరేలా ప్రయత్నిస్తానని చెప్పారు. అధికార, విపక్ష పార్టీలను కలుపుకొని హిమాచల్ ప్రదేశ్‌ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని దత్తాత్రేయ అన్నారు. రాజ్యాంగ పదవి చేపట్టిన తాను రాజకీయాలను ప్రస్తావించబోనని దత్తాత్రేయ స్పష్టంచేశారు. 

మరిన్ని

13 అంతస్తుల భవనంపైకి ఎక్కి రైతుల నిరసన [13:36]

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ భవనంపైకి ఇద్దరు రైతులు ఎక్కడం ఆందోళన కలిగిస్తోంది. తుళ్లూరు, నెక్కల్లు గ్రామాలకు చెందిన కొందరు రైతులు నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మె్ల్యే క్వార్టర్స్‌ వద్ద

‘డమ్మీ కాన్వాయ్‌తో ట్రయల్‌ రన్‌..సిగ్గుచేటు’ [19:32]

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పెరిగే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ ఒప్పందం చేసుకున్నారని.. అందుకే అమరావతిని చంపేస్తున్నారని...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [20:54]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం [23:44]

గుజరాత్‌ రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లా ఘోర దేవ్‌పరా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలవగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వీరంతా గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [23:38]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు ఉన్నారని, ప్రభుత్వానికి తమ ఆకాంక్షలను తెలియజేయాలనుకున్న తరుణంలో ఈ విధమైన అణిచివేత చర్యలు...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [23:32]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

తెదేపా నేతల గృహనిర్బంధం [23:24]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

రాజధాని కోసం ఆగిన మరో గుండె [23:19]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

దీపికపై అభిమానుల ఫైర్‌ [23:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

ఫేస్‌బుక్‌ పోస్టు.. సినిమాలాంటి ట్విస్టు [22:52]

మంచి చేసేవాళ్లకు ఎప్పటికైనా మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ వార్త చదివితే ఎవరికైనా అది  నిజమనిపించక మానదు.